
ఆసియాకప్-2023లో భాగంగా సోమవారం నేపాల్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఉన్నపళంగా అతడు శ్రీలంక నుంచి స్వదేశానికి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా ముంబైకు వచ్చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కారణమిదేనా?
కాగా బుమ్రా భార్య సంజనా గణేశన్ త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సమయంలో భార్య పక్కనే ఉండాలని బుమ్రా నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఉన్నపళంగా బుమ్రా లంక నుంచి స్వదేశానికి వచ్చేసినట్లు పలురిపోర్టులు పేర్కొంటున్నాయి.
నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. సూపర్-4కు అర్హత సాధిస్తోంది. భారత్ సూపర్-4కు క్వాలిఫై అయితే సెప్టెంబర్ 10న తమ తదుపరి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సమయానికి బుమ్రా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఐర్లాండ్‌పై రీ ఎంట్రీ..
గాయం కారణంగా దాదాపు ఏడాది తర్వాత బుమ్రా ఐర్లాండ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనంతోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బుమ్రా అదరగొట్టాడు. నాయుకుడిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. అదే విధంగా పాకిస్తాన్‌తో రద్దైన మ్యాచ్‌లో కూడా 16 పరుగులతో బుమ్రా రాణించాడు.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్..