ITF Women's Tournament 2023: Yamalapalli Sahaja quits in first round - Sakshi
Sakshi News home page

ITF Women's Tourney 2023: పోరాడి ఓడిన సహజ 

Mar 9 2023 7:23 AM | Updated on Mar 9 2023 10:23 AM

IT Womens Tourney 2023: Yamalapalli Sahaja Quits In First Round - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లి పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. బెంగళూరులో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సహజ 6–7 (8/10), 3–6తో డయానా మర్సిన్‌కెవిచా (లాతి్వయా) చేతిలో ఓడిపోయింది.

గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ అంకితా రైనా 6–3, 6–0తో వన్షిత (భారత్‌)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరింది.    

Advertisement
 
Advertisement
Advertisement