IPL Retention 2022: ఈ 27 మంది ఓకే.. మరి ఆ ఆరు స్థానాలు.. వార్నర్‌, రాహుల్‌, రషీద్‌, గిల్‌ ఇంకా

IPL Retention: 27 Players Retained By 8 Existed Teams What About New Teams - Sakshi

ఐపీఎల్‌ ఆటగాళ్ల కొనసాగింపునకు ముగిసిన గడువు

 27 మందిని అట్టి పెట్టుకున్న 8 ఫ్రాంచైజీలు

మరో ఆరుగురిని తీసుకోనున్న రెండు కొత్త జట్లు

మిగిలిన క్రికెటర్లంతా మెగా వేలానికి అందుబాటులో

కొత్త జట్లకు తొలి అవకాశం   

IPL Retention: 27 Players Retained By 8 Existed Teams What About New Teams: ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు తాము కొనసాగించే ఆటగాళ్ల జాబితాను 8 జట్లు ప్రకటించేశాయి. మొత్తంగా 27 మంది క్రికెటర్లను రిటైన్‌ చేసుకోనున్నట్లు ఆయా ఫ్రాంఛైజీలు వెల్లడించాయి. ఇప్పుడు రిటైనింగ్‌లో ఎనిమిది టీమ్‌లు తమ వద్దే ఉంచుకున్న ఆటగాళ్లను మినహాయించగా... మిగిలిన క్రికెటర్ల నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంచుకుంటాయి.

అహ్మదాబాద్, లక్నో జట్లు డిసెంబర్‌ 25లోగా గరిష్టంగా ముగ్గురు చొప్పున క్రికెటర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వారంతా వేలంలో అందుబాటులోకి వస్తారు. ఈ ఆరు స్థానాల కోసం వార్నర్, కేఎల్‌ రాహుల్, శుబ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, రషీద్‌ ఖాన్, డుప్లెసిస్, ధావన్, స్టొయినిస్, ఇషాన్‌ కిషన్, హార్దిక్, షారుఖ్‌ ఖాన్, స్టోక్స్, ఆర్చర్, చహల్, బెయిర్‌స్టో, హోల్డర్, ముజీబ్‌ తదితర ఆటగాళ్లకు భారీ డిమాండ్‌ ఉండబోతోంది.

కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో 10 జట్లు పోటీపడనున్న విషయం తెలిసిందే. రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) వెంచర్స్‌ లిమిటెడ్‌ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్‌ డాలర్లు) వెచ్చించి లక్నో జట్టును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్‌ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్‌) రూ. 5,625 కోట్లతో అహ్మదాబాద్‌ను దక్కించుకుంది.

ఇక కేఎల్‌ రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ను సొంతం చేసుకునేందుకు లక్నో ఫ్రాంఛైజీ వారిని ప్రలోభాలకు గురిచేసిందంటూ పంజాబ్‌, హైదరాబాద్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఒకవేళ నిజంగానే లక్నో రాహుల్‌ను కొనుగోలు చేస్తే అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

చదవండి: IPL Retention: వార్నర్‌తో పాటు అతడిని కూడా.. మీకు మీ ఫ్రాంచైజీకు ఓ దండం రా బాబు..

పెద్దగా మార్పులు లేవు.. అయితే!
ఐపీఎల్‌-2022లో 8 జట్లు ఆడినట్లే ఇకపైనా 10 జట్లు కూడా లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లే ఆడతాయి. అయితే రెండు జట్ల వల్ల మ్యాచ్‌ల సంఖ్య మాత్రం 74కు చేరింది. అయితే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 5 జట్లు తలపడతాయి. ఈ ఐదు జట్ల మధ్య ఇంటా (4), బయటా (4) ఎనిమిది మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం అవతలి గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్, ఒక్క జట్టుతో మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడటం ద్వారా 14 మ్యాచ్‌లు పూర్తవుతాయి.

చదవండి: Ipl Retention: రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. జడేజాకు భారీ ధర.. పూర్తి వివరాలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top