పాండ్యా స్ఫూర్తిదాయక వీడియో

IPL Final Match: Hardik Pandya Shares Motivational Video - Sakshi

దుబాయ్‌: గత యాభై రోజులుగా క్రికెట్‌ అభిమానులకు వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్‌ 2020 సీజన్‌ ముంగిపునకు వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య నేటి (మంగళవారం) సాయంత్రం 7.30 గంటలకు ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈనేపథ్యంలో ముంబై ఆటగాడు హార్దిక్‌ పాండ్యా ముంబైకి మద్దతు కూడగట్టేందుకు ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఫిట్‌నెస్‌, ప్రాక్టిస్‌కు సంబంధించి ఎంతగా శ్రమించాల్సి వస్తుందో తెలిజేసే వీడియో అది. ‘ఇన్నాళ్లూ ఒక ఎత్తు. ఫైనల్‌ మ్యాచ్‌ మరో ఎత్తు. మా సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం వచ్చింది’అని పాండ్యా ట్విటర్‌లో పేర్కొన్నాడు. 

కాగా, మంచి హిట్టర్‌గా పేరున్న పాండ్యా.. తనపై రోహిత్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో 13 మ్యాచుల్లో పాల్గొని 278 పరుగులు చేసి జట్టు విజయాల్లో తన వంతు​పాత్ర పోషించాడు. వాటిలో 14 ఫోర్లు, 25 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక క్వాలిఫయర్‌ మ్యాచ్‌ మినహాయిస్తే.. తాజా సీజన్‌లో ఢిల్లీతో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ముంబై విజయం సాధించింది. మొదట జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో, రెండోసారి జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఢిల్లీపై రోహిత్‌ సేన గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌ 2013, 2015, 2017, 2019 ఐపీఎల్‌ టైటిల్స్‌ సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ ఫైనల్‌.
(చదవండి: అతని గేమ్‌ వేరే లెవెల్‌లో ఉంది: రోహిత్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top