‘డిజిటల్‌’లో 15 శాతం పెరుగుదల | IPL 2026 viewership scales up in digital space | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’లో 15 శాతం పెరుగుదల

May 16 2026 6:26 AM | Updated on May 16 2026 6:26 AM

IPL 2026 viewership scales up in digital space

ఐపీఎల్‌ రేటింగ్స్‌పై జియో స్టార్‌ ప్రకటన

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తాజా సీజన్‌లో మ్యాచ్‌లను డిజిటల్‌ వేదికగా చూసే ప్రేక్షకుల సంఖ్య చాలా పెరిగింది. టీవీ రేటింగ్‌ తగ్గాయంటూ ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో డిజిటల్‌ రేటింగ్‌ సంఖ్య ఆసక్తికరంగా మారింది. అభిమానులు తమ చేతిలో మొబైల్స్‌లో మ్యాచ్‌ను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో డిజిటల్‌ వ్యూయర్‌ షిప్‌ 15 శాతం పెరిగినట్లు ‘జియో స్టార్‌’ ప్రకటించింది.

 ప్రాంతీయ భాషల్లో కూడా వీక్షకుల సంఖ్య ఏకంగా 42 శాతం పెరిగిందని ప్రసారకర్తలు వెల్లడించారు. టీవీ రేటింగ్స్‌ కూడా త్వరలోనే 500 మిలియన్లు (50 కోట్లు) దాటనున్నాయని కూడా స్టార్‌ పేర్కొంది.  టీవీ, డిజిటల్‌లలో కలిపి 38 మంది స్పాన్సర్లు ఉండటం, 125 మంది కొత్త అడ్వర్టయిజర్లు రావడం ఐపీఎల్‌ స్థాయిని చూపిస్తోందని జియో స్టార్‌ హెడ్‌ ఆఫ్‌ సేల్స్‌ అనూప్‌ గోవిందన్‌ చెప్పారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement