IPL 2026: రెండో దశలో సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..! | IPL 2026: SRH matches scheduled in second phase | Sakshi
Sakshi News home page

IPL 2026: రెండో దశలో సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

Mar 26 2026 7:07 PM | Updated on Mar 26 2026 7:35 PM

IPL 2026: SRH matches scheduled in second phase

ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. ఈ దశలో 50 మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి దశలో ప్రకటించిన 20 మ్యాచ్‌లతో కలుపుకొని లీగ్‌ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో వెలువడుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేశారు.  

కాగా, తెలుగు రాష్ట్రాల ఏకైక ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో విడత ప్రకటించిన షెడ్యూల్‌లో 10 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి విడత నాలుగు మ్యాచ్‌లతో కలుపుకొని సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌ లీగ్‌ దశ మొత్తంలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది.

రెండో దశ ప్రారంభ మ్యాచ్‌లోనే (ఏప్రిల్‌ 13) ఎస్‌ఆర్‌హెచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా రాత్రి 7:30 గంటలకు జరుగనుంది.

ఏప్రిల్‌ 18- సీఎస్‌కేతో (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్‌ 21- ఢిల్లీ క్యాపిటల్స్‌తో (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్‌ 25- రాజస్థాన్‌ రాయల్స్‌ (జైపూర్‌, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్‌ 29- ముంబై ఇండియన్స్‌ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
మే 3- కేకేఆర్‌ (హైదరాబాద్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 6- పంజాబ్‌ కింగ్స్‌ (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)
మే 12- గుజరాత్‌ టైటాన్స్‌ (అహ్మదాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)
మే 18- సీఎస్‌కే (చెన్నై, రాత్రి 7:30 గంటలకు)
మే 22- ఆర్సీబీ (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)

తొలి దశలో ప్రకటించిన షెడ్యూల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు..
మార్చి 28- ఆర్సీబీతో (బెంగళూరు, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్‌ 2- కేకేఆర్‌తో (కోల్‌కతా, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్‌ 5- లక్నో సూపర్‌ జెయింట్స్‌తో (హైదరాబాద్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)
ఏప్రిల్‌ 11- పంజాబ్‌ కింగ్స్‌తో (ముల్లాన్‌పూర్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement