ఆర్సీబీకి షాక్‌!.. స్వదేశానికి విధ్వంసకర వీరుడు! | IPL 2026: RCB Overseas Star Phil Salt Returns Home Mid Season | Sakshi
Sakshi News home page

ఆర్సీబీకి షాక్‌!.. స్వదేశానికి విధ్వంసకర వీరుడు!

May 4 2026 1:33 PM | Updated on May 4 2026 1:49 PM

IPL 2026: RCB Overseas Star Phil Salt Returns Home Mid Season

PC: BCCI

ఐపీఎల్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన పాటీదార్‌ సేన.. ఇప్పటికి తొమ్మిదింట ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, ఇటీవల గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. తదుపరి లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. ఏకనా స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌తో తిరిగి గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

వేలికి గాయం
గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విధ్వంసకర ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ గాయం నుంచి కోలుకోలేదని సమాచారం. కాగా ఏప్రిల్‌ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సాల్ట్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ బౌండరీ నుంచి డైవ్‌ చేస్తూ బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమచేయి వేలికి గాయమైంది.

యూకేకి చేరుకున్న సాల్ట్‌
ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న సాల్ట్‌.. తాజాగా స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. యూకేకి చేరుకున్న అతడు గాయానికి సంబంధించి స్కానింగ్‌ చేయించుకున్నట్లు సమాచారం. కాగా గత మూడు మ్యాచ్‌లలో సాల్ట్‌ ఆడలేదు. అతడికి బదులు ఇంగ్లండ్‌ మరో స్టార్‌ జేకబ్‌ బెతెల్‌.. విరాట్‌ ‍కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్నాడు.

 కాగా సాల్ట్‌ ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 202 పరుగులు సాధించాడు. అయితే, త్వరలోనే అతడు కోలుకుని తిరిగి జట్టుతో చేరతాడని ఆర్సీబీ ధీమా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్లే ఆఫ్స్‌ నాటికైనా సాల్ట్‌ అందుబాటులోకి వస్తాడనే ఆశాభావంతో ఉంది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఏప్రిల్‌ 30న మ్యాచ్‌ ముగించుకున్న ఆర్సీబీకి దాదాపు వారం రోజుల విశ్రాంతి లభించింది. దీంతో జట్ట మాల్దీవులకు విహారానికి వెళ్లినట్లు సమాచారం.

చదవండి: గర్ల్‌ఫ్రెండ్స్‌.. శ్రుతిమించుతున్నారు!.. ఇకపై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement