IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ | IPL 2026, RCB Smashes Fastest 200 Plus Chase Record In IPL History, It Came In Just 15.4 Overs Vs SRH | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

Mar 29 2026 5:39 PM | Updated on Mar 29 2026 6:34 PM

IPL 2026: RCB has the fastest 200 plus chase in IPL history, it came in just 15.4 overs vs SRH

ఐపీఎల్‌ 2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే విజయం సాధించింది. నిన్న (మార్చి 28) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో సన్‌రైజర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఏకపక్ష విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే (15.4 ఓవర్లలో) ఛేదించడం ద్వారా ఓ భారీ రికార్డు నెలకొల్పింది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్‌ టార్గెట్‌ను ఊదేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు రాజస్థాన్‌ రాయల్స్‌ పేరిట ఉండేది. రాయల్స్‌ గత ఎడిషన్‌లో (2025లో గుజరాత్‌పై) 200 ప్లస్‌ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. తాజాగా ఆర్సీబీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.

ఆర్సీబీ ఈ రికార్డు సాధించడంలో కింగ్‌ విరాట్‌ కోహ్లి కీలకపాత్ర పోషించాడు. భారీ ఛేదనలో విరాట్‌ తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో అలరించి (38 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాచ్‌ను వేగంగా ముగించాడు. గెలుపుకు 17 పరుగులు కావాల్సిన తరుణంలో విరాట్‌ వరుసగా 6, 4, 4, 4 బాది ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకునేలా చేశాడు.

ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకోవడంలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), రజత్‌ పాటిదార్‌ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తమవంతు పాత్ర పోషించారు. వీరిద్దరు కూడా వేగంగా ఆడి ​కొండంత లక్ష్యాన్ని కరిగించారు. అంతకుముందు ఇషాన్‌ కిషన్‌ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్‌ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన 200 ప్లస్‌ లక్ష్య ఛేదనలు..
15.4 - RCB vs SRH, బెంగళూరు, 2026*
15.5 - RR vs GT, జైపూర్, 2025
16.0 - RCB vs GT, అహ్మదాబాద్, 2024
16.3 - MI vs RCB, వాంఖేడే, 2023
17.3 - DC vs GL, ఢిల్లీ, 2017

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement