IPL 2023 RR VS GT Jaipur: Match Updates And Highlights - Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన రషీద్‌ ఖాన్‌.. రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

May 5 2023 7:06 PM | Updated on May 5 2023 10:24 PM

IPL 2023 RR VS GT Jaipur: Match Updates And Highlights - Sakshi

రెచ్చిపోయిన రషీద్‌ ఖాన్‌.. రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం
119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 13.5 ఓవర్లలో గిల్‌ వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు వృద్దిమాన్‌ సాహా (41 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (36) రాణించగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్ధిక్‌ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్‌ వికెట్‌ చహల్‌కు దక్కింది. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. గుజరాత్‌ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3 వికెట్లతో రెచ్చిపోగా, నూర్‌ అహ్మద్‌ 2, షమీ, హార్ధిక్‌, జాషువ లిటిల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్ణాన్‌ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
71 పరగుల వద్ద గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. చహల​్‌ బౌలింగ్‌లో గిల్‌ (36) స్టంపౌటయ్యాడు.  

లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న గుజరాత్‌
119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఓపెనర్లు  లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నారు. గిల్‌ (27), సాహా (27) నిలకడగా ఆడుతుండటంతో ఆ జట్టు 7 ఓవర్లలో 57 పరుగులు చేసింది. 

టార్గెట్‌ 119.. నిలకడగా ఆడుతున్న గుజరాత్‌ ఓపెనర్లు
119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సాహా (23) కాస్త వేగంగా ఆడుతుంటే గిల్‌ (13) ఆచితూచి ఆడుతున్నాడు. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 39/0.  ​

తిప్పేసిన స్పిన్నర్లు.. 118 పరుగులకే కుప్పకూలిన రాజస్థాన్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. గుజరాత్‌ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3, నూర్‌ అహ్మద్‌ 2, షమీ, హార్ధిక్‌, జాషువ లిటిల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్ణాన్‌ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో హెట్‌మైర్‌ (7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో రాజస్థాన్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 

ఏడో వికెట్‌ డౌన్‌
నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో దృవ్‌ జురెల్‌ (9) ఔట్‌ కావడంతో రాజస్థాన్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 

ఆరో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ (12) క్లీన్‌ బౌల్డ్‌ కావడంతో రాజస్థాన్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 12 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 82/6. హెట్‌మైర్‌ (4), దృవ్‌ జురెల్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. 

69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌
రాజస్థాన్‌ 69 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌ (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పడిక్కల్‌ (10), హైట్‌మైర్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

కష్టాల్లో రాజస్థాన్‌.. 63 పరుగులకే 4 వికెట్లు డౌన్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాజస్థాన్‌ కకష్టాల్లో చిక్కుకుంది. ఆ జట్టు 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జాషువ లిటిల్‌ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (30) ఔట్‌ కాగా, ఆ మరుసటి ఓవర్‌లోనే రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ (2) క్లీన్‌ బౌల్డయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 63/4. పడిక్కల్‌ (7)రియాన్‌ పరాగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.  

రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌.. యశస్వి ఔట్‌
రాజస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. యశస్వి జైస్వాల్‌ (14) రనౌటయ్యాడు. 5.3 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 48/2. సంజూ శాంసన్‌ (24), పడిక్కల్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన​్‌ రెండో ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. హార్ధిక్‌ పాండ్యా బౌలింగ్‌లో మోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ (8) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్తాన్‌ స్కోర్‌ 12/1. యశస్వి (1), సంజూ శాంసన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.  

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌
ఐపీఎల్‌-2023లో భాగంగా జైపూర్‌ వేదికగా ఇవాళ (మే 5) రాజస్థాన్‌ రాయల్స్‌- గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు..
రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, దృవ్‌ జురెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్‌ శర్మ, ఆడమ్‌ జంపా, చహల్‌

గుజరాత్‌ టైటాన్స్‌: హార్ధిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌, విజయ్‌ శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, నూర్‌ అహ్మద్‌, జాషువ లిటిల్‌, మోహిత్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement