గ్రీన్‌ సుడిగాలి శతకం.. సన్‌రైజర్స్‌పై ముంబై ఘన విజయం

IPL 2023: MI VS SRH Updates And Highlights - Sakshi

గ్రీన్‌ సుడిగాలి శతకం.. ముంబై ఘన విజయం
సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై టీమ్‌ సునాయాసంగా ఛేదించింది. రోహిత్‌ (56) హఫ్‌ సెంచరీతో రాణించగా.. కెమారూన్‌ గ్రీన్‌ (47 బంతుల్లో 100 నాటౌట్‌) విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ముంబై టీమ్‌ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు వివ్రాంత్‌ శర్మ (69), మయాంక్‌ అగర్వాల్‌ (83) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 

గ్రీన్‌ సుడిగాలి హాఫ్‌ సెంచరీ
కెమారూన్‌ గ్రీన్‌ సుడిగాలి హాఫ్‌ సెంచరీ చేశాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అర్ధశతకం బాదాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 100/1. రోహిత్‌ శర్మ 31 క్రీజ్‌లో ఉన్నాడు. 

ముంబై ముందు భారీ లక్ష్యం
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ భారీ స్కోర్‌ సాధించింది. వివ్రాంత్‌ శర్మ (69), మయాంక్‌ అగర్వాల్‌ (83) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. క్లాసెన్‌ (18), ఫిలిప్స్‌ (1), బ్రూక్‌ (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్‌ మధ్వాల్‌ 4 వికెట్లు పడగొట్టాడు.

సెంచరీ మిస్‌ చేసుకున్న మయాంక్‌
మయాంక్‌ అగర్వాల్‌ (83) 17 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు. ఆకాశ్‌ మధ్వాల్‌ బౌలింగ్‌ ఇషాన కిషన్‌కు ఇచ్చి ఔటయ్యాడు. 16.4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 174/2. 

దుమ్ములేపుతున్న వివ్రాంత్‌ శర్మ
సన్‌రైజర్స్‌ఓపెనర్‌ వివ్రాంత్‌ శర్మ (55) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అతనికి మరో ఎండ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (40) సహకరిస్తున్నాడు. వీరి ధాటికి సన్‌రైజర్స్‌ 11 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 103 పరుగులు చేసింది.  

ధాటిగా ఆడుతున్న సన్‌రైజర్స్‌ ఓపెనర్లు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (28), వివ్రాంత్‌ సింగ్‌ (29) శుభారంభాన్ని అందించారు. వీరి ధాటికి సన్‌రైజర్స్‌ 7 ఓవర్లలో 63 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (మే 21) ముంబై ఇండియన్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు..

ముంబై ఇండియన్స్‌: 
రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కెమారూన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, నేహల్‌ వధేరా, టిమ్‌ డేవిడ్‌, పియూశ్‌ చావ్లా, జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, ఆకాశ్‌ మధ్వాల్‌, క్రిస్‌ జోర్డాన్‌, కుమార్‌ కార్తికేయ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

మయాంక్‌ అగర్వాల్‌, వివ్రాంత్‌ శర్మ, ఎయిడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, హ్యారీ బ్రూక్‌, నితీశ్‌ రెడ్డి, గ్లెన్‌ ఫిలిప్స్‌, సన్వీర్‌ సింగ్‌, మయాంక్‌ డాగర్‌,  భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top