
లక్నో ఆటగాళ్లతో కోహ్లి వాగ్వాదం (PC: IPL)
IPL 2023- LSG Vs RCB- Kohli Vs Gambhir: ‘‘అసలు కోహ్లికి అంత కోపమెందుకొచ్చింది? గౌతం అంత సీరియస్ ఎందుకయ్యాడు? మ్యాచ్ జరుగుతున్నపుడు.. ఏం జరిగిందన్నది కాదు.. మ్యాచ్ తర్వాత అసలైన గందరగోళం చోటుచేసుకుంది. నా దృష్టిలో ఇలాంటి ప్రవర్తన అస్సలు సరికాదు.
నిజమే.. లక్నోపై ప్రతీకారం తీర్చుకునే సమయం. గత మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ తేడాతో ఓడిన ఆర్సీబీ ఈసారి 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదంతా బాగుంది. కానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం అవాంఛనీయం. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకే కాదు చాలా మందికి ఇలాగే అనిపించి ఉంటుంది.
గొడవపడ్డ వాళ్లిద్దరూ గొప్ప క్రికెటర్లు. విరాట్ కోహ్లి.. అతడు యూత్ ఐకాన్. చాలా మంది అతడిని చూసి.. అతడి లాగే ఎదగాలని కోరుకుంటారు. కానీ ప్రతిసారి ఇలా గొడవపడితే... వాళ్లు కోహ్లి నుంచి ఏం నేర్చుకుంటారు.
నేను కోహ్లిలాంటి ఆటగాడిని కావాలి గానీ.. అలాంటి **** అవకూడదు అని అనుకుంటున్నారు. నేను పూర్తి చేయలేకపోయిన ఆ మాటలేంటో మీకు తెలుసనే అనుకుంటున్నా.
కోహ్లి ఇలా.. గంభీరేమో అలా
ఇక గౌతం విషయానికొస్తే.. చిన్నస్వామి స్టేడియంలో అతడు అలా చేయకుండా ఉండాల్సింది. ఇద్దరూ గతంలో ఇలా దూకుడుగా ప్రవర్తించిన వాళ్లే. కానీ ఈసారైనా కనీసం సంయమనం పాటించాల్సింది. ఎందుకో నాకైతే వాళ్లు మరీ శ్రుతిమించినట్లు అనిపించింది’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. కోహ్లి- గంభీర్ తీరును విమర్శించారు.
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు సొంత మైదానంలో అన్నీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కెప్టెన్ రాహుల్ గాయపడటం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో 19.5 ఓవర్లలో 108 పరుగులకే సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. 18 పరుగుల తేడాతో ఆర్సీబీని విజయం వరించింది. చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.
భావోద్వేగాలు నియంత్రించుకోలేక
పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ భావోద్వేగాలను నియంత్రిచుకోలేకపోయారు. ఇక ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మరింత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం లక్నో మెంటార్ గౌతం గంభీర్- కోహ్లి, కోహ్లి- నవీన్ ఉల్ హక్ మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం హైలైట్ అయింది.
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కోహ్లి- గంభీర్ గొడవకు కారణమేంటో వాళ్లు చెప్తే తప్ప తెలియదని.. ఏదేమైనా ఇద్దరూ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని పేర్కొన్నాడు. ఇలా గొడవలకు దిగే వాళ్లను చూసి యువ క్రికెటర్లు ఏం నేర్చుకుంటారంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఈ ఘటనలో ఇద్దరిదీ తప్పేనని అభిప్రాయపడ్డాడు.
చదవండి: LSG Vs RCB: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్ వైరల్
సంజూ చీట్ చేయలేదు.. కొంచెం చూసి మాట్లాడండి! రోహిత్‌ది క్లియర్ ఔట్
The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49
— Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023