IPL Share Fresh Clip Of Rohit Sharma Dismissal Against Rajasthan Royals, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: సంజూ చీట్‌ చేయలేదు.. కొంచెం చూసి మాట్లాడండి! రోహిత్‌ది క్లియర్‌ ఔట్‌

May 2 2023 11:30 AM | Updated on May 2 2023 11:52 AM

 IPL share fresh clip of Rohit Sharmas dismissal against Rajasthan Royals  - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔటైన విధానం మాత్రం వివాదాస్పదమైంది. 3 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌ సందీప్‌ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

అయితే  రోహిత్‌ శర్మ ఔట్‌ కాలేదని.. సంజూ శాంసన్‌ గ్లోవ్స్ తగలడంతోనే  బెయిల్స్‌ కిందపడ్డాయి అని హిట్‌మ్యాన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేశారు. రోహిత్‌ శర్మకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కామెంట్లు చేశారు.

క్లారిటీ ఇచ్చిన ఐపీఎల్‌
ఇక రోహిత్‌ శర్మ ఔట్‌పై ఐపీఎల్‌ క్లారిటీ ఇచ్చింది. రోహిత్‌ ఔట్‌కు సంబంధించిన క్లియర్‌ వీడియోను ఐపీఎల్‌లో ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో సృష్టంగా బంతికి స్టంప్స్‌ను తాకినట్లు కన్పించింది. అదే విధంగా శాంసన్‌ గ్లోవ్స్‌, స్టంప్స్‌కు మధ్య కూడా చాలా గ్యాప్‌ ఉంది.

ఇక ఇందుకు సంబంధించిన వీడియెను సంజూ ఫ్యాన్స్‌ రోహిత్‌ అభిమానులను టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. సంజూ చీట్‌ చేశాడరన్నారు కదా.. ఇప్పుడేం అంటారు అని క్యాప్షన్‌గా పెడుతున్నారు.
చదవండి: #Virat Kohli: షాకిచ్చిన బీసీసీఐ! చూసేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్‌ వైరల్‌! ఫ్యాన్స్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement