హిట్‌మ్యాన్‌కు చేదు అనుభవాల్ని మిగిల్చిన ఐపీఎల్‌ 2022..చెత్త రికార్డులు నమోదు  

IPL 2022: Rohit Sharma Worst Batting Record With No Half Century - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఐపీఎల్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోహిత్‌ ఈ సీజన్‌లో చెత్త రికార్డులన్నీ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్‌లో రోహిత్‌ సారధ్యంలో ముంబై ఇండియన్స్‌ వరుసగా 8 మ్యాచ్‌ల్లో పరాజయంపాలై మునుపెన్నడూ లేని అప్రతిష్టను మూటగట్టుకోగా.. హిట్‌మ్యాన్‌ వ్యక్తిగతంగానూ చాలా అపవాదులను ఎదుర్కొన్నాడు.

సీజన్‌ ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీని ఖంగుతినిపించి ఆర్సీబీని ఘనంగా ప్లే ఆఫ్స్‌కు సాగనంపిన రోహిత్‌ సేన.. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 10 పరాజయాలతో సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇలా టేబుల్‌ ఆఖరి స్థానంలో నిలువడం ఇదే మొదటిసారి. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా ఘోరంగా విఫలమైన రోహిత్‌.. వ్యక్తిగతంగానూ దారుణంగా నిరాశపరిచాడు. సీజన్‌ మొత్తంలో పేలవ ఫామ్‌ను కొనసాగించి పలు చెత్త రికార్డులను నమోదు చేశాడు. 

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ (13 బంతుల్లో 2) పేలవ ప్రదర్శనను కొనసాగించిన హిట్‌మ్యాన్‌.. ఈ సీజన్‌లో ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయకుండా కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు. 2008లో ఐపీఎల్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి రోహిత్‌ ఇంత చెత్త గణాంకాలు ఎప్పుడూ నమోదు చేయలేదు. తొలిసారి ఓ సీజన్‌ను కనీసం హాఫ్‌ సెంచరీ చేయకుండా ముగించాడు. లీగ్‌ చరిత్రలో 2018 సీజన్‌లో ఏకైకసారి 300ల్లోపు పరుగులు (286) చేసిన హిట్‌మ్యాన్‌ తాజాగా సీజన్‌లో ఆ చెత్త రికార్డును కూడా అధిగమించాడు.   
చదవండి: ఐపీఎల్‌లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-05-2022
May 22, 2022, 15:22 IST
ఐపీఎల్ 2022 సీజన్‌ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌, పంజాబ్‌...
22-05-2022
May 22, 2022, 13:28 IST
 శ్రేయస్‌ నుంచి పగ్గాలు చేపట్టాడు.. ఢిల్లీ కెప్టెన్‌గా పంత్‌ కరెక్ట్‌: పాంటింగ్‌
22-05-2022
May 22, 2022, 13:19 IST
ఐపీఎల్ 2022 సీజన్‌ చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌లో ఇవాళ (మే 22) సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని...
22-05-2022
May 22, 2022, 13:14 IST
కోల్‌కతా నగరాన్ని తుఫాన్‌ ముంచెత్తింది. శనివారం రాత్రి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కోల్‌కతాలోని...
22-05-2022
May 22, 2022, 12:15 IST
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...
22-05-2022
May 22, 2022, 12:09 IST
IPL 2022: ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్‌ ఫోర్‌కు చేరేలా చేసిన ముంబై ఇండియన్స్‌...
22-05-2022
May 22, 2022, 11:48 IST
ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి.. అంబరాన్నంటిన ఆర్సీబీ సంబరాలు.. వీడియో
22-05-2022
May 22, 2022, 11:02 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో శనివారం ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్‌గా...
22-05-2022
May 22, 2022, 11:02 IST
ఓటమిపై తీవ్ర అసంతృప్తిలో పంత్‌, దీనికి కారణం!
22-05-2022
May 22, 2022, 09:25 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కథ లీగ్‌ దశలోనే ముగిసింది. కచ్చితంగా ప్లే ఆఫ్స్‌ చేరుకుంటుందని అంతా అనుకున్న...
22-05-2022
May 22, 2022, 08:44 IST
ఆట అన్నాకా గెలుపోటములు సహజం. మ్యాచ్‌ ఎంత ఉత్కంఠగా సాగినా ఒకరిని మాత్రమే విజయం వరిస్తుంది.  యాదృశ్చికం అనాలో లేక...
22-05-2022
May 22, 2022, 08:04 IST
ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు.. తెలుగుతేజం నంబూరి తిలక్‌ వర్మ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. డెబ్యూ సీజన్‌లో ఒక...
22-05-2022
May 22, 2022, 05:53 IST
ముంబై: సీజన్‌ ఆసాంతం నిరాశపరిచిన ముంబై ఇండియన్స్‌ తమ చివరి మ్యాచ్‌లో అభిమానుల్ని మురిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచి... రాయల్‌...
21-05-2022
May 21, 2022, 23:33 IST
ఐపీఎల్‌-2022 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి చెందింది....
21-05-2022
May 21, 2022, 20:50 IST
ఐపీఎల్‌-2022 తుది దశకు చేరుకుంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో బౌలర్ల కంటే బ్యాటర్లు అదరగొట్టారు. యువ బ్యాటర్లు కూడా...
21-05-2022
May 21, 2022, 18:26 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 21) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. ప్లే ఆఫ్స్‌ నాలుగో స్థానాన్ని ఖరారు...
21-05-2022
May 21, 2022, 17:58 IST
ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ థీమా వక్య్తం చేశాడు....
21-05-2022
May 21, 2022, 17:07 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నిన్న (మే 20) సీఎస్‌కేతో జరిగిన ఆసక్తికర సమరంలో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం...
21-05-2022
May 21, 2022, 16:30 IST
IPL 2022 MI Vs DC: ఒకరి ఓటమి మరొకరికి సంతోషం.. ముందుకు సాగేందుకు గొప్ప అవకాశం. ఢిల్లీ క్యాపిటల్స్‌...
21-05-2022
May 21, 2022, 15:53 IST
 గత సీజన్‌లో అదరగొట్టారు.. కోట్లు కొల్లగొట్టారు.. కానీ ఈసారి తుస్సుమన్నారు! 

Read also in:
Back to Top