IPL 2022: విజయ్‌ శంకర్‌ చేసిన రనౌట్‌ సరైనదేనా!

IPL 2022: Rishab Pant Ask Umpires Lalit Yadav Run-Out Done Vijay Shankar - Sakshi

ఐపీఎల్‌ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25 పరుగులు చేసిన లలిత్‌ యాదవ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అతను రనౌట్‌ అయిన తీరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ విజయ్‌ శంకర్‌ వేశాడు. ఆ ఓవర్‌ నాలుగో బంతిని పంత్‌ లెగ్‌సైడ్‌ దిశగా ఆడాడు. సింగిల్‌కే అవకాశమున్నప్పటికి పంత్‌ అనవసరంగా రెండో పరుగుకు యత్నించాడు. కాగా బంతిని అందుకున్న మనోహర్‌ విజయ్‌ శంకర్‌కు త్రో విసిరాడు. లలిత్‌ యాదవ్‌ క్రీజులోకి చేరేలోపే విజయ్‌ శంకర్‌ వికెట్లను గిరాటేశాడు.

ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బంతి అందుకోవడానికి ముందే విజయ్‌ శంకర్‌ తన కాలితో పొరపాటున వికెట్లను తన్నడంతో ఒక బెయిల్‌ కిందపడింది. అప్పటికే బంతి విజయ్‌ శంకర్‌ చేతిలో పడడం.. వెంటనే వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. ఇది గమనించిన పంత్‌ కాస్త కన్ఫ్యూజ్‌ అయ్యాడు.  అంపైర్‌ వద్దకు వచ్చి మరోసారి రనౌట్‌ను పరిశీలించాలని కోరాడు.

అయితే అంపైర్లు విజయ్‌ శంకర్‌ పొరపాటున ముందే వికెట్లను తన్నినప్పటికి..  లలిత్‌ యాదవ్‌ను రనౌట్‌ చేసే సమయానికి బంతి అతని చేతిలోనే ఉందని.. కాబట్టి అది ఔటేనని వివరించారు. దీంతో చేసేదేం లేక లలిత్‌ యాదవ్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విజయ్‌ శంకర్‌ చేసిన రనౌట్‌ కరెక్టేనా అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి: Ashwin Vs Tilak Varma: తిలక్‌ వర్మపై రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆగ్రహం

లలిత్‌ యాదవ్‌ రనౌట్‌ కోసం క్లిక్‌ చేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top