
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (మే 7) రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీకొట్టనుంది. పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగుతుండగా.. లక్నో, కేకేఆర్ మ్యాచ్‌కు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదిక కానుంది.
లక్నో, కేకేఆర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఇరు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో లక్నో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. కేకేఆర్ 10 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో 8వ స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు ఆడిన తమ చివరి మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులపై విజయాలు సాధించి జోరుమీద ఉన్నాయి. లక్నో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించగా.. కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.
వాతావరణం ఎలా ఉండబోతుందంటే..
మ్యాచ్ సమయానికి 40 శాతం తేమ, 34 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశాలు లేవు.
పిచ్ రిపోర్ట్..
పూణేలోని ఎంసీఏ స్టేడియం పిచ్ మొదట్లో బ్యాటింగ్‌కు, మ్యాచ్ సాగుతున్నకొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ వికెట్‌పై ఛేజింగ్ చేసే జట్టుకు ప్రయోజనం ఉంటుంది.
తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..
లక్నో సూపర్ జెయింట్స్: డికాక్ (వికెట్‌కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, స్టొయినిస్, అయుశ్ బదోని, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుశ్మంత చమీర, మోహిసిన్ ఖాన్, రవి బిష్ణోయ్
కేకేఆర్: ఆరోన్ ఫించ్, బాబా ఇంద్రజిత్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, శివమ్ మావిచదవండి: IPL 2022: అదే జరిగితే కోహ్లి రికార్డుకు మూడినట్లే..!