IPL 2022: కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుపై హర్భజన్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

IPL 2022: Harbhajan Singh Reckons Jos Buttler Will Break Virat Kohli Record - Sakshi

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఆర్సీబీ త‌ర‌ఫున ఆ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నెల‌కొల్పిన ఆల్‌టైమ్ రికార్డుపై టీమిండియా మాజీ స్పిన్న‌ర్‌, ప్ర‌స్తుత ఎంపీ హర్భజన్ సింగ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. 2016 సీజ‌న్‌లో విరాట్ సాధించిన అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ను (16 మ్యాచ్‌ల్లో 81.08 స‌గ‌టున‌ 152 స్ట్రయిక్ రేటుతో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో 973 పరుగులు) ప్ర‌స్తుత సీజ‌న్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్‌ జోస్ బట్లర్ త‌ప్ప‌క అధిగ‌మిస్తాడ‌ని భ‌జ్జీ జోస్యం చెప్పాడు. 

ఈ సీజ‌న్‌లో ఇప్పటికే 10 ఇన్నింగ్స్‌ల్లో 65.33 స‌గ‌టున 150.77 స్ట్రయిక్ రేటుతో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 588 పరుగులు సాధించిన బ‌ట్ల‌ర్ ఆరెంజ్ క్యాప్‌ను హోల్డ్ చేయ‌డంతో పాటు కోహ్లి రికార్డు దిశ‌గా దూసుకెళ్తున్నాడ‌ని, ఈ సీజ‌న్‌లో రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరితే కోహ్లి రికార్డు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. కోహ్లి రికార్డును బ‌ట్ల‌ర్ అధిగ‌మించి ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ను న‌మోదు చేయాలంటే గ్రూప్ స్టేజీలో ఆ జ‌ట్టు ఆడాల్సిన‌ మిగిలిన 4 మ్యాచ్‌లతో పాటు ప్లే ఆఫ్స్‌లోనూ అదరగొట్టాల్సి ఉంటుంద‌ని అన్నాడు. 

కోహ్లి రికార్డును అధిగ‌మించే అర్హ‌త, స‌త్తా బ‌ట్ల‌ర్‌కు ఉన్నాయ‌ని, ఈ సీజ‌న్‌లో అత‌ని ఫామ్ చూస్తుంటే కోహ్లి రికార్డుతో పాటు మ‌రెన్నో రికార్డుల‌కు బీట‌లు వార‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేశాడు. అయితే, బ‌ట్ల‌ర్ ఈ ఘ‌న‌తల‌ను సాధించాలంటే రాజ‌స్థాన్ ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరాల్సి ఉంటుందని అన్నాడు. లీగ్ ద‌శ మ్యాచ్‌ల‌తో పాటు ప్లే ఆఫ్స్ జ‌రిగే పిచ్‌లు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించ‌డం బ‌ట్ల‌ర్‌కు క‌లిసొస్తుంద‌ని తెలిపాడు. 

కాగా, రాజ‌స్థాన్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఆ జ‌ట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో (గ్రూప్ ద‌శ‌లో) రెండింటిలో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. రాజ‌స్థాన్ ఇవాళ (మే 7) పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆ జ‌ట్టు 4 వికెట్ల న‌ష్టానికి 122 ప‌రుగులు చేసింది. 
చ‌ద‌వండి: IPL 2022: కరుణ్‌ అవుట్‌.. యశస్వి ఇన్‌: సంజూ శాంసన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2022
07-05-2022
May 07, 2022, 15:22 IST
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్‌- 2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఒక మార్పుతో...
07-05-2022
May 07, 2022, 14:13 IST
IPL 2022 MI Vs GT: ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో వెస్టిండీస్‌ ‘హిట్టర్‌’ కీరన్‌ పొలార్డ్‌ను 6 కోట్ల...
07-05-2022
May 07, 2022, 13:05 IST
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య శనివారం మ్యాచ్‌ జరుగనుంది. ఇక...
07-05-2022
May 07, 2022, 11:46 IST
ఐపీఎల్‌-2022లో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ముంబై ఇండియన్స్‌ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్‌లో...
07-05-2022
May 07, 2022, 10:44 IST
ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేస్ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు...
07-05-2022
May 07, 2022, 09:41 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 5 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది....
07-05-2022
May 07, 2022, 08:27 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో...
07-05-2022
May 07, 2022, 07:48 IST
సన్‌రైజర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌ ముగిసే సరికి ఢిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 54 బంతుల్లో 92 పరుగులు...
07-05-2022
May 07, 2022, 05:34 IST
ముంబై: గుజరాత్‌ 178 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లే 12 ఓవర్లలో 106 పరుగులు చేశారు. ఇక మిగిలిన 8 ఓవర్లలో...
06-05-2022
May 06, 2022, 22:26 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అంచనాలకు మంచి భాగానే రాణిస్తోంది. జోస్ బట్లర్ 588 పరుగులతో ఆరెంజ్ క్యాప్...
06-05-2022
May 06, 2022, 21:54 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌...
06-05-2022
May 06, 2022, 19:36 IST
ఐపీఎల్‌ 2022లో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్‌...
06-05-2022
06-05-2022
May 06, 2022, 17:07 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 6) ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో  నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. రాత్రి 7:30...
06-05-2022
May 06, 2022, 16:43 IST
ఐపీఎల్‌ ఎంతో మంది కొత్త ఆటగాళ్లను పరిచయం చేసింది.. చేస్తూనే ఉంది. దేశవాలీ క్రికెట్‌లో ఆడినప్పటికి రాని పేరు ఐపీఎల్...
06-05-2022
May 06, 2022, 16:19 IST
IPL 2022 MI Vs GT: వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌తో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ఉన్న...
06-05-2022
May 06, 2022, 15:33 IST
ఐపీఎల్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌ హ్యాట్రిక్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్‌ ఆరంభంలో వరుసగా రెండు ఓటములు చవిచూసినప్పటికి మధ్యలో ఐదు వరుస...
06-05-2022
May 06, 2022, 14:54 IST
భారీ సిక్సర్‌ కొట్టాలని భావిస్తున్న రోవ్‌మన్‌ పావెల్‌
06-05-2022
May 06, 2022, 13:51 IST
ఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో... 

Read also in:
Back to Top