Pat Cummins: ఐపీఎల్‌ 2022 నుంచి వైదొలిగిన కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌

IPL 2022: KKR Star Bowler Pat Cummins Leaves IPL 2022 With Hip-Injury - Sakshi

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌.. కేకేఆర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ ఐపీఎల్‌ 2022 నుంచి వైదొలిగాడు. తుంటి ఎముక గాయం కారణంగా కమిన్స్‌ లీగ్‌ను వీడినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికి వచ్చే నెలలో శ్రీలంక పర్యటన ఉన్న కారణంగా కమిన్స్‌ ఐపీఎల్‌ వీడినట్లు సమాచారం. ప్రస్తుతం స్వదేశానికి పయనమయిన కమిన్స్‌ సిడ్నీలోని రీహాబిలిటేషన్‌ సెంటర్‌కు చేరుకోనున్నాడు.

లంకతో సిరీస్‌ వరకు ఫిట్‌నెస్‌ సాధించి వన్డే, టెస్టు సిరీస్‌లకు సిద్దంగా ఉండాలని కమిన్స్‌ భావించాడు. కాగా లంకతో టి20 సిరీస్‌కు కమిన్స్‌ దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా సిరీస్‌ జరగడంపై అనుమానాలు ఉన్నప్పటికి.. దుబాయ్‌ వేదికగా ఈ సిరీస్‌ను నిర్వహించాలనే యోచనలో లంక్‌ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కమిన్స్‌ ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 56 పరుగులు సాధించి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఫిఫ్టీ అందుకున్న బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌తో కలిసి కమిన్స్‌ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్‌ 63 పరుగులతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్‌ 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కేకేఆర్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కేకేఆర్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికి ప్లే ఆఫ్‌ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

చదవండి: Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్‌.. కీలక సమయంలో యువ ఆటగాడు దూరం!

IPL 2022: సీఎస్‌కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్‌ఆర్‌హెచ్‌ బాటలోనేనా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-05-2022
May 13, 2022, 11:05 IST
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించగానే తర్వాతి...
13-05-2022
May 13, 2022, 09:31 IST
ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్‌ వైఫల్యంతో ఘోర ప్రదర్శన చేసింది. సీఎస్కే బ్యాటర్లంతా కట్టగట్టుకొని విఫలం...
13-05-2022
May 13, 2022, 08:46 IST
తెలుగుతేజం తిలక్‌ వర్మ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మరోసారి మెరిశాడు. గురువారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల లక్ష్య...
13-05-2022
May 13, 2022, 08:17 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆటగాళ్ల కంటే అంపైర్లే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఫీల్డ్‌ అంపైర్స్‌ నుంచి థర్డ్‌ అంపైర్‌ వరకు...
13-05-2022
May 13, 2022, 04:24 IST
ముంబై: ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన తర్వాత మెరుగ్గా ఆడుతున్న ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని తమ ఖాతాలో...
12-05-2022
May 12, 2022, 22:44 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ఔటైన తీరు వివాదాస్పదంగా...
12-05-2022
12-05-2022
May 12, 2022, 18:50 IST
ఐపీఎల్‌-2022లో టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌, ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఆర్‌సీబీ...
12-05-2022
May 12, 2022, 17:56 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో...
12-05-2022
May 12, 2022, 17:12 IST
పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రిషి ధావన్‌ టీమిండియాలోకి తిరిగి రావాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. రిషి ధావన్‌ బ్యాట్‌తో...
12-05-2022
May 12, 2022, 16:36 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే​ ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ (మే 12) ముంబై...
12-05-2022
May 12, 2022, 15:24 IST
సీఎస్‌కే తాజా మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఐపీఎల్‌ 2022 సీజన్‌ మొత్తానికే దూరమైన విషయం తెలిసిందే....
12-05-2022
May 12, 2022, 13:13 IST
IPL 2022 Closing Ceremony: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభ, ముగింపు వేడుకలను...
12-05-2022
May 12, 2022, 12:48 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌పై సూపర్‌ విక్టరీతో మెరిసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి...
12-05-2022
May 12, 2022, 10:28 IST
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తర్వలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. అయితే నటుడిగా మాత్రం కాదు.....
12-05-2022
May 12, 2022, 09:04 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో...
12-05-2022
May 12, 2022, 08:28 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉ‍న్నాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
12-05-2022
May 12, 2022, 08:01 IST
ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాపిటల్స్‌ 8 వికెట్లతో రాజస్తాన్‌ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ...
12-05-2022
May 12, 2022, 01:40 IST
ముంబై: సీజన్‌లో ఒక విజయం తర్వాత ఒక పరాజయం... గత పది మ్యాచ్‌లలో ఇలాగే పడుతూ, లేస్తూ సాగుతున్న ఢిల్లీ...
11-05-2022
May 11, 2022, 22:16 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 2022 సీజన్‌లో భాగంగా... 

Read also in:
Back to Top