Breadcrumb
- HOME
Live Updates
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
బోణీ కొట్టిన గుజరాత్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం
ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటరల్లో రాహుల్ తెవాటియా(40), హార్ధిక్ పాండ్యా(33), మిల్లర్(30) పరుగులతో రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలరల్లో చమీరా రెండు వికెట్లు పడగొట్టగా, కృనాల్ పాండ్యా, హుడా, ఆవేష్ఖాన్ చెరో వికెట్ సాధించారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన
లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా(55), బదోని(54) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కాగా లక్నో స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రాహుల్, డికాక్, మనీష్ పాండే దారుణంగా విఫలమయ్యారు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు.
ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన మిల్లర్.. ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గుజరాత్ విజయానికి 15 బంతుల్లో 21 పరుగులు కావాలి.
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
79 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన వేడ్.. హుడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి గుజరాత్ 88 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. హార్ధిక్ పాండ్యా ఔట్
73 పరుగుల వద్ద గుజరాత్ హార్ధిక్ పాండ్యా రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో హార్ధిక్.. మనీష్ పాండే క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 55/2
8 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి గుజరాత్ టైటాన్స్ 55 పరుగులు చేసింది. క్రీజులో హార్థిక్ పాండ్యా(27), వేడ్(17) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
15 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన విజయ్ శంకర్, చమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. గిల్ డకౌట్
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన చమీరా బౌలింగ్‌లో గిల్ డకౌటయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 159 పరుగులు
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా(55), బదోని(54) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కాగా లక్నో స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రాహుల్, డికాక్, మనీష్ పాండే దారుణంగా విఫలమయ్యారు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు.
ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
116 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ దీపక్ హుడా రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన హుడా.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
దీపక్ హుడా అర్ధ సెంచరీ.. 15 ఓవర్లకు లక్నో స్కోర్: 109/4
పీకల్లోతు కష్టాల్లో పడిన లక్నో సూపర్ జెయింట్స్‌ను దీపక్ హుడా అదుకున్నాడు. 37 బంతుల్లో హుడా అర్ధ సెంచరీ సాదించాడు. 15 ఓవర్లు ముగిసేసరికి లక్నో.. నాలుగు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. క్రీజులో హుడా(55), బదోనీ(28) పరుగులతో ఉన్నారు.
11 ఓవర్లకు లక్నో స్కోర్: 58/4
11 ఓవర్లు ముగిసేసరికి లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. క్రీజులో హుడా(25), బదోనీ(7) పరుగులతో ఉన్నారు.
వరుసగా రెండు వికెట్లు
వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్ మరింత కష్టాల్లో పడింది. ఆరోన్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి లూయిస్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
షమీ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి మనీష్ పాండే పెలివియన్ చేరాడు. షమీ అద్భుత బంతితో పాండే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన లక్నో
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో రాహుల్‌ను ఔట్ చేసిన షమీ.. మూడో ఓవర్లో డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి లక్నో 14 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్ జెయింట్స్‌కు అదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్‌కు చేరాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్లో కొత్త జట్లుగా అవతరించిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తొలి పోరుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయిట్స్కు కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ ఉండగా, గుజరాత్ టైటాన్స్‌కు హార్ధిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు.
తుది జట్లు
గుజరాత్: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ
లక్నో: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
Related News By Category
Related News By Tags
-
విరాట్ విశ్వరూపం.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఆదివారం వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యా...
-
పాక్ పట్ల భారత వైఖరిపై విండీస్ స్టార్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరిపై విండీస్ స్టార్ క్రికెటర్, ఆ దేశ మాజీ కెప్టెన్, టీ20 స్పెషలిస్ట్ జేసన్ హోల్డర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల హోల్డర్ Game On wi...
-
టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..
టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు. పంజాబ్ తరఫున ఓపెనర్‌గా గిల...
-
పంత్ కాదు!.. వన్డే వరల్డ్‌కప్ జట్టులోనూ అతడే!
వన్డేల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. తాత్కాలిక సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో భారత జట్టు కెప్టెన్ హోదాలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస...
-
'అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి'
2025 ఏడాది.. టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ...


