IPL 2022: వేలంలో ఏమిటో ఇదంతా అనుకున్నా.. కానీ ఇప్పుడు ఆ రెండు జట్లు సూపర్‌!

IPL 2022: Aakash Chopra Comments On GT and SRH Success Surprising - Sakshi

IPL 2022 GT Vs SRH: ఐపీఎల్‌ మెగా వేలం-2022 సమయంలో విమర్శల పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరంభంలో తడబడినా తిరిగి పుంజుకుని వరుస విజయాలతో దూసుకుపోతోంది. అదే విధంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని కొత్త జట్టు​ గుజరాత్‌ టైటాన్స్‌ సైతం అంచనాలకు మించి రాణిస్తూ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం(ఏప్రిల్‌ 27) పోరు జరుగనుంది. 

ఇక టైటాన్స్‌పై గెలుపుతో ఐపీఎల్‌-2022లో బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌ వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయాలు సాధించగా.. ఈ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిన హార్దిక్‌ సేన ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది.

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌, టైటాన్స్‌పై మెగా వేలం సమయంలో వచ్చిన ట్రోల్స్‌, ప్రస్తుత ఆట తీరు పట్ల టీమిండియా మాజీ బ్యాటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మెగా వేలం సమయంలో ఈ రెండు జట్లు అనుసరించిన విధానం పట్ల నాకు ఆశ్చర్యం వేసింది. గుజరాత్‌ టైటాన్స్‌కు బ్యాటింగ్‌లో కేవలం హార్దిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌ ఉన్నారు.

హైదరాబాద్‌ విదేశీ బ్యాటర్లను కొనుగోలు చేసింది. కానీ వాళ్లు ఇక్కడి పిచ్‌లపై ఏమాత్రం రాణిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉండేది. బౌలర్ల విషయానికొస్తే సన్‌రైజర్స్‌కు వాషింగ్టన్‌ సుందర్‌ మినహా మెరుగైన స్పిన్నర్‌ ఎవరూ లేరు. కాబట్టి వేలంలో వాళ్ల వ్యూహం కాస్త గజిబిజిగా తోచింది. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా అద్భుత ప్రదర్శనలతో రెండు జట్లూ ముందుకు దూసుకుపోతున్నాయి’’ అని పేర్కొన్నాడు.

ఇక గుజరాత్‌ బౌలింగ్‌ విభాగం కూర్పు అద్భుతంగా ఉందన్న ఆకాశ్‌ చోప్రా.. ‘‘డబ్బు ఎక్కువ ఉంటే స్టాక్స్‌ లేదంటే రియల్‌ ఎస్టేట్‌లో పెడతారు చాలా మంది. గుజరాత్‌ మాత్రం రియల్‌ ఎస్టేట్‌ వైపు మొగ్గు చూపింది. రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, లాకీ ఫెర్గూసన్‌, అల్జారీ జోసెఫ్‌, యశ్‌ దయాల్‌ను కొనుగోలు చేసింది’’ అని చమత్కరించాడు.

వీరితో పాటు గుజరాత్‌కు హార్దిక్‌ పాండ్యా కూడా ఉన్నాడని.. వీరంతా ఆ జట్టు బలం అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయడ్డాడు. ఇక ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఒకే ఒక్కటి ఓడిన గుజరాత్‌ 12 పాయింట్లతో టాప్‌-2లో ఉండగా.. హైదరాబాద్‌ 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

చదవండి👉🏾IPL 2022: వాళ్లు అదరగొడుతున్నారు.. ఆ మూడు జట్లే ఫేవరెట్‌.. ఎందుకంటే!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top