బయోబబూల్‌లో మా పరిస్థితి ఇలాగే ఉంది..

IPL 2021: Virat Kohli Showcase Life Bio-bubble Latest Post Became Viral - Sakshi

Virat Kohli Shows Life In Bio Bubble.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ 2021 టైటిల్‌ అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. తనకు కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్‌ అని విరాట్‌ కోహ్లి ఇప్పటికే ప్రకటించడంతో ఈసారి ఎలాగైనా ఆర్‌సీబీ కప్‌ కొడుతుందని అంతా భావించారు. కానీ కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ అనూహ్యంగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక తర్వాతి సీజన్‌ నుంచి కోహ్లి ఆర్‌సీబీకి ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. 

చదవండి: Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్‌ కూడా

ఇక తాజాగా విరాట్‌ కోహ్లి టి20 ప్రపంచకప్‌ ఉండడంతో టీమిండియా బయోబబూల్‌లోకి వెళ్లిపోయాడు. అయితే కరోనా వైరస్‌ తర్వాత బయోబబూల్‌ ప్రతీ ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో బయోబబూల్‌ అనేది ఎంత కష్టంగా ఉందో కోహ్లి ఒక్క ఫోటోతో చూపించాడు. తనను తాను కుర్చీకి కట్టేసుకొని.. బయోబబూల్‌లో మా పరిస్థితి అచ్చం ఇలాగే ఉందని పేర్కొన్నాడు. బయోబబూల్‌ వల్ల చాలా మంది ఆటగాళ్లు మానసిక ఒత్తిడి గురయ్యారు. పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ బయోబబూల్‌ కారణంగానే ఐపీఎల్‌ వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లి కూడా బయోబబూల్‌ అనేది నచ్చలేదంటే పరోక్షంగా ఒక్క ఫోటోలోనే చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కోహ్లి ఫోటో సోషల్‌  మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: IPL 2021: టి20 కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని అరుదైన రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top