ఐపీఎల్‌ 2021: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్‌

IPL 2021: Six More Indian Cricketers In IPL Got Player Of Match Awards In 7 Matches - Sakshi

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ప్రధానంగా బౌలర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఐపీఎల్‌ అంటేనే బ్యాటర్స్‌ గేమ్‌.. కానీ అందుకు విరుద్ధంగా బౌలర్లు రాణిస్తున్నారు. ఇప్పటివరకూ చూసిన మ్యాచ్‌లను చూస్తే పంజాబ్‌ కింగ్స్‌-రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోరు తప్పితే,  మిగతావన్నీ రెండొందలోపే స్కోర్లను చూశాం. ఇక కోల్‌కత నైట్ రైడర్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ  క్యాపిటల్స్‌ మ్యాచ్‌ల్లో 180కి పైగా స్కోర్ నమోదైంది. మిగిలిన నాలుగింట్లోనూ 160కి లోపే స్కోర్‌ వచ్చింది. ఇలాంటి లో స్కోరింగ్‌ మ్యాచ్‌ల్లో సైతం బ్యాట్స్‌మెన్లు అపసోపాలు పడాల్సి వచ్చింది అనేకంటే బౌలర్లు భళా అనిపించారంటేనే బాగుంటుంది. 

ఇదిలా ఉంచితే, ఈ సీజస్‌లో ఇప్పటివరకూ అందుకున్న ఆరు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు  భారత క్రికెటర్లనే వరించాయి. వీరిలో ముగ్గురు బౌలర్లే ఉండటం విశేషం. ఆ ముగ్గురు బౌలర్లు తమ జట్లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటిదాకా హర్షల్ పటేల్, శిఖర్ ధావన్, నితీష్ రాణా, సంజు శాంసన్, రాహుల్ చాహర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జయదేవ్ ఉనద్కత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.  

వారిలో మ్యాక్స్‌వెల్ ఒక్కడే విదేశీ క్రికెటర్. ఆర్సీబీ-సన్‌రైజర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించడంతో అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద అవార్డు దక్కింది. నిన్న(గురువారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయంలో జయదేవ్‌ ఉనాద్కత్‌ తన వంతు పాత్ర పోషించాడు.  నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు సాధించి 15 పరుగులే ఇచ్చాడు.  దాంతో ఢిల్లీ 147 పరుగులకే పరిమితం కాగా, ఆపై రాజస్థాన్‌ ఇంకా రెండు బంతులు ఉండగా విజయాన్ని అందుకుంది.  డేవిడ్‌ మిల్లర్‌(62), క్రిస్‌ మోరిస్‌(36)ల చలవతో రాజస్థాన్‌ విజయాన్ని దక్కించుకుంది. 

ఇక్కడ చదవండి: ‘అశ్విన్‌కు బౌలింగ్‌ ఎందుకు ఇవ్వలేదో అడుగుతా’
ఢిల్లీ ఓటమి: పంత్‌ మిస్టేక్‌ వెరీ క్లియర్‌..!
Chris Morris: ఇజ్జత్‌ అంటే ఇదేనేమో.. వెల్‌డన్‌ మోరిస్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top