
Photo Courtesy: IPL Twitter
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఉనాద్కట్ వేసిన బంతిని ధావన్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి ధావన్ బ్యాట్‌ను తాకుతూ సామ్సన్‌కు దూరంగా వెళ్లింది. అది వదిలేసి ఉంటే మాత్రం కచ్చితంగా బౌండరీ దాటేది. అయితే మెరుపు వేగంతో స్పందించిన సామ్సన్ ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. సామ్సన్ అద్భుత క్యాచ్‌తో బిక్కమొహం వేసిన ధావన్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు.
కాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన సామ్సన్ ఆఖరివరకు నిలిచినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుతం 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. కాగా ఈ మూడు వికెట్లు రాజస్తాన్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ ఖాతాలో పడడం విశేషం.
చదవండి: ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్ భావోద్వేగం
Flying Samson @IamSanjuSamson, what a catch 👏👏🔥🔥 #DCvsRR #IPL2021 #DC #RRvsDC pic.twitter.com/AOIjSD4IAI
— Rohit Yadav (@RohitnVicky) April 15, 2021