'ఫుల్‌ ఎంజాయ్‌ చేశా.. మిస్‌ యూ ముంబై ఇండియన్స్‌'

IPL 2021 Quinton De Kock Wife Sasha Emotional Farewell To Mumbai Indians - Sakshi

ముంబై: దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా మహమ్మారి కారణంగా బీసీసీఐ ఐపీఎల్‌ సీజన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో డికాక్‌ తన స్వంత దేశానికి వెళ్లిపోయాడు. కాగా ఐపీఎల్‌ ఆడేందుకు వచ్చిన డికాక్‌తో పాటు అతని భార్య షాషా హర్లీ కూడా వచ్చింది. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతీసారి హాజరై వారిని ఉత్సాహపరుస్తూ.. ఇతర క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లతో కలిసి తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంది. అయితే కరోనా కారణంగా లీగ్‌ మధ్యలోనే రద్దు కావడంతో తన భర్తతో కలిసి స్వదేశానికి వెళ్లిపోయిన షాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'మిస్‌ యూ ముంబై ఇండియన్స్‌' అంటూ రాసుకొచ్చింది.


ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ''ఐపీఎల్‌ను ఇంత త్వరగా వీడాల్సి వస్తుందని ఊహించలేదు. కానీ ఐపీఎల్‌ జరిగినన్ని రోజులు ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీతో బాగా కలిసిపోయా.. ముఖ్యంగా స్పెషల్‌ లేడీస్‌.. ప్రెండ్స్‌ను చాలా మిస్సవుతున్నా. కానీ కరోనా కారణంగా అర్థంతరంగా వారిని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మీరంతా ఇంట్లోనే ఉంటూ మాస్క్‌లు ధరించి సురక్షింతగా ఉండండి. మనం మళ్లీ కచ్చితంగా మీటవుదాం.'' అని రాసుకొచ్చింది. ఇక డికాక్‌ ఈ సీజన్‌లో మొదట విఫలమైన ఆ తర్వాత ఫామ్‌ అందుకొని మంచి ప్రదర్శన కనబరిచాడు. డికాక్‌ ఆరు మ్యాచ్‌లాడి 155 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఐపీఎల్‌లో 72 మ్యాచ్‌లాడిన డికాక్‌ 2114 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 15 అర్థ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top