కేకేఆర్‌..అది మీకే టైమ్‌ వేస్ట్‌: గావస్కర్‌

IPL 2021: Narine At No 4 Or 5 Is A waste Of Time, Sunil Gavaskar - Sakshi

అహ్మదాబాద్‌:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 154 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. శుబ్‌మన్‌ గిల్‌(43), రసెల్‌(45 నాటౌట్‌)లు మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ స్కోరును ఢిల్లీ అవలీలగా ఛేదించడంతో కేకేఆర్‌కు మరో ఓటమి తప్పలేదు. ఇది కేకేఆర్‌కు ఐదో ఓటమి కాగా రెండే విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ వరుసగా విఫలం కావడంతో దిగ్గజ  క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆ జట్టులోని లోపాల్ని ఎత్తిచూపాడు.

ప్రధానంగా మిడిల్‌ ఆర్డర్‌లో కేకేఆర్‌ ఘోరంగా విఫలం కావడంతోనే భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతుందని విమర్శించాడు.  ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్టాడిన గావస్కర్‌..  అహ్మదాబాద్‌లో పిచ్‌ మంచి బ్యాటింగ్‌ ట్రాక్‌. మరి కేకేఆర్‌ బ్యాటింగ్‌ చేయడానికి ఎందుకు అపసోపాలు పడింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ జట్టులో ఎక్కువమంది క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ లేరు. గిల్‌ను తప్పించి చూడండి.. మోర్గాన్‌ క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ కాదు. రసెల్‌ 5 కానీ, 6 స్థానాల్లో వస్తున్నాడు.

దినేశ్‌ కార్తీక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ప్రమోట్‌ చేయడం లేదు. చాలామంది డగౌట్‌లో కూర్చొని చూస్తున్నారు. వారు ఎందుకు బ్యాటింగ్‌కు రావడం లేదో అర్థం కావడం  లేదు. ఒకసారి కేకేఆర్‌ బ్యాటింగ్‌ను చూడండి. సునీల్‌ నరైన్‌ 4 లేదా 5 స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కేకేఆర్‌కు వేస్ట్‌ అఫ్‌ టైమ్‌. అతని బ్యాటింగ్‌లో ఆ స్థానంలో రావడంలో అర్థం లేదు. కేకేఆర్‌ తుది జట్టులో నరైన్‌ ఉన్నప్పుడు ఆర్డర్‌లో​ ముందుగా దింపడమే మంచింది. అప్పుడు కనీసం కొన్ని షాట్లైన కనెక్ట్‌ అవుతాయి’ అని తెలిపాడు.  ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నరైన్‌ ఆడిన  తొలి బంతికే ఔటయ్యాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top