‘నేను 30-40 పరుగులు చేశానా అనేది మ్యాటర్‌ కాదు’

 IPL 2021: Doesnt Matter If I Am Scoring 30, 40 Runs, Samson  - Sakshi

గంభీర్‌ అర్థమవుతోందా?

ఢిల్లీ:  ఏ సమయంలోనైనా జట్టులోని ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలని అంటున్నాడు రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌. ప్రతీ ఆటగాడ్ని బాగా ఆడుతున్నారని చెప్పడం కొనసాగించాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నాడు.  మన గేమ్‌పై మనకు నమ్మకం ఉంటే ఫలితం అనేది అదే వస్తుందని సామ్సన్‌ పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత అవార్డుల కార్యక్రమంలో సామ్సన్‌ మాట్లాడుతూ.. ‘ మా బౌలర్లు గత 5-6 మ్యాచ్‌ల నుంచి బౌలింగ్‌ బాగా వేస్తున్నారు. వారి బౌలింగ్‌ ప్రదర్శనతో గర్వంగా ఉంది. స్పెషలిస్టు బౌలర్లున్న జట్టుకు సారథ్యం వహించడం ఆనందంగా ఉంది. మీరు రిజల్ట్స్‌ను చూసినట్లయితే మేము ఎక్కువ మ్యాచ్‌లు గెలవలేదు.

కానీ మంచి క్రికెట్‌ ఆడుతున్నాం.,. ఐపీఎల్‌ అనేది ఫన్నీ టోర్నమెంట్‌.  ఒక వ్యక్తి, ఒక బాల్‌, ఒక ఓవర్‌తో గేమ్‌ను ఛేంజ్‌ చేయవచ్చు. నేను ఫామ్‌లో ఉన్నానా లేదా అనేది మ్యాటర్‌ కాదు. జట్టు బాగా ఆడటమే నాకు కావాలి. నేను 30-40 పరుగులు చేస్తున్నానా.. లేక నిలకడగా ఆడుతున్నానా అనేది సమస్య కాదు.

కానీ జట్టులో నా భాగస్వామ్యం బాగుండాలనుకుంటాను’ అని తెలిపాడు. రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన బట్లర్‌ను సామ్సన్‌ కొనియాడాడు. బట్లర్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని గొప్పగా భావిస్తానన్నాడు. తాము నమోదు చేసిన భాగస్వామ్యాన్ని ఎంజాయ్‌ చేశామన్న సామ్సన్‌.. బట్లర్‌ ఫామ్‌ను కనబరిచిన ప్రతీసారి విజయాలు సాధించామన్నాడు. కాగా, సామ‍్సన్‌ నిలకడగా ఆడటం లేదని ఇటీవల గంభీర్‌ విమర్శించాడు. కనీసం 30-40 పరుగులు చేయకుండా 0,1,6 ఇలా ఔటైతే ఎలా అంటూ ప్రశ్నించాడు.

ఇక్కడ చదవండి: సామ్సన్‌.. వారు నీలాగ 0, 1 చేయడం లేదు: గంభీర్‌‌

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top