పవర్‌ ప్లే: తొలి స్థానంలో సీఎస్‌కే.. రెండో స్థానంలో ఢిల్లీ | IPL 2021: CSK Takes Most Wickets In Powerplay Creates New Record | Sakshi
Sakshi News home page

పవర్‌ ప్లే: తొలి స్థానంలో సీఎస్‌కే.. రెండో స్థానంలో ఢిల్లీ

Apr 28 2021 8:42 PM | Updated on Apr 28 2021 10:14 PM

IPL 2021: CSK Takes Most Wickets In Powerplay Creates New Record - Sakshi

Courtesy : IPL T20. Com

ఢిల్లీ: ఐపీఎల్‌ 14 వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఒక రికార్డును తన పేరిట లిఖంచుకుంది. ఈ సీజన్‌లో పవర్‌ ప్లే(0-6ఓవర్ల మధ్య)లో అత్యధిక వికెట్లు తీసిన జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లు కలిపి పవర్‌ ప్లేలో 14 వికెట్లు తీసి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉంది.

ఇక 9 వికెట్లతో ఆర్‌సీబీ మూడు.. 8 వికెట్లతో పంజాబ్‌, కేకేఆర్‌లు సంయుక్తంగా నాలుగో స్థానంలో , 3 వికెట్లతో ముంబై ఐదు.. 2 వికెట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ చివరి స్థానంలో ఉంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ 12 ఓవర్ల ఆట ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక వికెట్‌ నష్టపోయి 82 పరుగులు చేసింది. వార్నర్‌ 38, పాండే 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement