16 కోట్ల ఆటగాడిపై ఒత్తిడి.. నేనైతే అంత ఇవ్వను!

IPL 2021: Chris Morris Went For A lot Of Money, Pietersen - Sakshi

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. మోరిస్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న రాజస్థాన్‌.. అతనికి భారీ మొత్తం చెల్లించి తీసుకుంది. కానీ అతను రాజస్థాన్‌ అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో తప్పితే పెద్దగా ఆకట్టుకున్న సందర్భాలు లేవు. ప్రధానంగా బౌలింగ్‌లో మోరిస్‌ బారీ పరుగుల్ని సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన మోరిస్‌.. 14 ఓవర్లు బౌలింగ్‌ వేసి 139 పరుగులిచ్చాడు. ఇందులో అతను తీసుకున్న వికెట్లు ఐదు. ఆర్సీబీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లే వేసిన మోరిస్‌ 38 పరుగులు సమర్పించుకున్నాడు. 

దీనిపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ మాట్లాడుతూ.. మోరిస్‌ ప్రదర్శనను ఎత్తిచూపాడు. ‘ భారీ మొత్తం చెల్లించి మోరిస్‌ను రాజస్థాన​ తీసుకుంది. మోరిస్‌పై అంత ధర పెట్టడం అంటే కాస్త ఆశ్చర్యమే అనిపించింది.  దక్షిణాఫ్రికా తరఫున కూడా అతను ఫస్ట్‌ చాయిస్‌ కాదు. నిజాయితీగా చెప్పాలంటే మోరిస్‌ను అంత ధర పెట్టి కొనాల్సిన అవసరం లేదు. నేనైతే అంత ధర మోరిస్‌పై పెట్టను. ఇలా చేస్తే అతనిపై ఒత్తిడి పెంచినట్లు ఉంటుంది.

మోరిస్‌ ప్రైస్‌ ట్యాగ్‌ ఏదైతే ఉందో అది అతన్ని ఒత్తిడిలోకి నెడుతుంది.  ఈ ధరను అతను కూడా ఊహించలేదు.  అందుకే ఒత్తిడి నెలకొంది. ఈ సీజన్‌లో నిలకడైన మోరిస్‌ను ఇంత వరకూ చూడలేదు. మోరిస్‌ ప్రదర్శన ఇలానే ఉంటే రాజస్థాన్‌ ఆడబోయే చాలా మ్యాచ్‌ల్లో అతనికి అవకాశం కూడా కష్టమే అవుతుంది. మనం కూడా అతని నుంచి భారీ ప్రదర్శన ఆశిస్తున్నాం. అతని గురించే ఎక్కువ మాట్లాడుతున్నాం. ఒకవేళ రాజస్థాన్‌ తరఫున రాణించినా అతనిపై ఆ ఫ్రాంచైజీ పెట్టుకోలేదు. దాంతో కొన్ని మ్యాచ్‌లు మోరిస్‌ తప్పకుండా మిస్సవుతాడు’ అని బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్‌తో మాట్లాడిన పీటర్సన్‌ తెలిపాడు. 

ఇక్కడ చదవండి: ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..!
సామ్సన్‌.. వారు నీలాగ 0, 1 చేయడం లేదు: గంభీర్‌‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top