CSK Vs SRH: సిక్స్‌తో ముగించిన ధోని.. ఫ్లేఆఫ్‌కు సీఎస్‌కే

IPL 2021 2nd Phase SRH Vs CSK Match Live Updates And Highlights - Sakshi

సిక్స్‌తో ముగించిన ధోని.. ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్‌కే ఘన విజయం
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో సీఎస్‌కే  ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ఓపెనర్లు రుతురాజ్‌ (45), డుప్లెసిస్‌(41) పరుగులతో చెన్నై విజయానికి బాటలు పరచగా.. మిగతా పనిని అంబటి రాయుడు(17), ధోని(14) కలిసి పూర్తి చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌ 1 వికెట్‌ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, బ్రావో 2, శార్దూల్‌, జడేజా చెరో వికెట్‌ తీశారు.

వెనువెంటనే రెండు వికెట్లు.. సీఎస్‌కే 113/4
సీఎస్‌కే వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ను జాసన్‌ హోల్డర్‌ వేయగా.. ఓవర్‌ మూడో బంతికి తొలుత రైనా(2) ఎల్బీగా వెనుదిరగ్గా.. ఆ తర్వాత ఐదో బంతికి డుప్లెసిస్‌(41)  సిద్ధార్థ్‌ కౌల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.

మొయిన్‌ అలీ ఔట్‌.. సీఎస్‌కే 103/2
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం దిశగా సాగుతుంది. 17 పరుగులు చేసిన మొయిన్‌ అలీ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 40, రైనా 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు రుతురాజ్‌ గైక్వాడ్‌ 45 పరుగులు చేసి హోల్డర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

రుతురాజ్‌ ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
రుతురాజ్‌ గైక్వాడ్‌(45) రూపంలో సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. జాసన్‌ హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలి బంతిని భారీ షాట్‌ ఆడగా.. విలియమ్సన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్‌కే 11 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసింది. సీఎస్‌కే విజయానికి 55 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది.

దాటిగా ఆడుతున్న సీఎస్‌కే.. 5 ఓవర్లలో 36/0
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసిస్‌లు పోటీ పడుతూ పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రుతురాజ్‌ 31, డుప్లెసిస్‌ 15 పరుగులతో ఆడుతున్నారు.

సీఎస్‌కే టార్గెట్‌ 135
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆరంభం నుంచి పెద్దగా మెరుపులు మెరిపించని ఎస్‌ఆర్‌హెచ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. వృద్ధిమాన్‌ సాహా 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మధ్యలో అభిషేక్‌ శర్మ(18), అబ్దుల్‌ సమద్‌(18) స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. చివర్లో రషీద్‌ ఖాన్‌ 2 ఫోర్ల సహాయంతో 17 పరుగులు చేయడంతో 130 పరుగులు మార్క్‌ను దాటింది. సీఎస్‌కే బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, బ్రావో 2, శార్దూల్‌, జడేజా చెరో వికెట్‌ తీశారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌..
జాసన్‌ హోల్డర్‌(5) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన హోల్డర్‌ చహర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 19 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అంతకముందు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో మూడో బంతికి అభిషేక్‌ శర్మ(18) వెనుదిరగ్గా.. తర్వాతి బంతికే అబ్దుల్‌ సమద్‌(18) మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

సాహా(44) ఔట్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ 74/4
నిలకడగా ఆడుతున్న వృద్ధిమాన్‌ సాహా(46 బంతుల్లో 44; ఫోర్‌, 2 సిక్సర్లు)ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. జడ్డూ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతికి కట్‌ చేయబోయే క్రమంలో వికెట్‌కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి సాహా వెనుదిరిగాడు. 12.3 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 74/4. క్రీజ్‌లో అభిషేక్‌ శర్మ(2), అబ్దుల్‌ సమద్‌ ఉన్నారు. 

మూడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. గార్గ్‌(7) ఔట్‌
బ్రావో వేసిన 10.5వ ఓవర్‌లో వికెట్‌కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి ప్రియం గార్గ్‌(10 బంతుల్లో 7) ఔటయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు 66 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో సాహా(38 బంతుల్లో 38), అభిషేక్‌ శర్మ ఉన్నారు. 

కేన్‌ విలియమ్సన్‌ ఔట్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ 45/2
ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 11 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల  నష్టానికి 45 పరుగులు చేసింది. సాహా 25, ప్రియమ్‌ గార్గ్‌ 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు రాయ్‌ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు.

6 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 41/1
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పవర్‌ ప్లే(తొలి 6 ఓవర్లు) ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. సాహా 24, విలియమ్సన్‌ 11 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు రాయ్‌ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు.

జేసన్‌ రాయ్‌ ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
జేసన్‌ రాయ్‌(2) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ 24 పరుగుల వద్ద తొలి వికెట్‌  తొలి వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి రాయ్‌ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది. సాహా 18, విలియమ్సన్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

షార్జా: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు సీఎస్‌కే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది. వరుస విజయాలతో జోరు మీద కనిపిస్తున్న సీఎస్‌కే టేబుల్‌ టాపర్‌గా ఉండడంతో పాటు పటిష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్‌ అవకాశాలను దూరం చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. అయితే ఫామ్‌లో ఉ‍న్న చెన్నైను ఎస్‌ఆర్‌హెచ్‌ ఏమేరకు నిలువరిస్తుందో చూడాలి.

ఇక తొలి అంచె పోటీలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇక సీఎస్‌కే 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. 2 ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం ఆడిన 10 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో అట్టడుగు స్థానంలో ఉంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 16 సార్లు తలపడగా.. సీఎస్‌కే 12 సార్లు, ఎస్‌ఆర్‌హెచ్‌ 4 సార్లు విజయం సాధించింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ : జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top