ఆసీస్‌కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం | Sakshi
Sakshi News home page

ఫించ్‌ ఔట్‌.. కెప్టెన్‌గా వేడ్‌

Published Sun, Dec 6 2020 1:22 PM

India Won The Toss Opt Bowl First In 2nd T20 Match - Sakshi

సిడ్నీ :  ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఏంచుకుంది. కాగా మూడు వన్డేల సిరీస్‌ను 2- 1 తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి టీ 20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే వశం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఆసీస్‌ మాత్రం ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో గెలుపు ద్వారా ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా తొలి టి 20లో ప్రతాపం చూపింది. కోహ్లి సేన ఆఖరిదాకా లాక్కెళ్లకుండా రెండో మ్యాచ్‌లోనే పొట్టి సిరీస్‌ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో టి20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

భారత్‌ విజయాల జోరులో ఉంటే... ఆస్ట్రేలియాను గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే డేవిడ్‌ వార్నర్‌ టీ20 సిరీస్‌కు దూరం  కాగా, అరోన్‌ ఫించ్‌ సైతం రెండో  టీ20కి దూరమయ్యాడు. గాయం కారణంగా ఫించ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో ఆసీస్‌ కెప్టెన్‌గా మాథ్యూ వేడ్‌ వ్యవహరిస్తున్నాడు. దాంతో పాటు హజల్‌వుడ్‌, స్టార్క్‌లు కూడా రెండో టీ20కి అందుబాటులో లేరు. ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం కావడం ఆసీస్‌ను కలవర పరుస్తోంది. వీరి ముగ్గురు  స్థానాల్లో సామ్స్‌, స్టోయినిస్‌, అండ్రూ టైలు తుది జట్టులోకి వచ్చారు. ఇక టీమిండియా విషయానికొస్తే గాయపడ్డ జడేజా స్థానంలో చహల్ తుది జట్టులోకి రాగా, మనీష్‌ పాండే స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్‌ను తీసుకున్నారు. కాగా ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫించ్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో అతని స్థానంలో మాథ్యూ వేడ్‌ నాయకత్వం వహించనుండగా.. స్టార్క్‌ స్థానంలో డేనియల్‌ సామ్స్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు :
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయాస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా, సుందర్, దీపక్‌ చహర్, నటరాజన్, శార్దూల్‌ ఠాకూర్‌, చహల్‌

ఆస్ట్రేలియా: డార్సీ షార్ట్, వేడ్(కెప్టెన్‌), స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, అబాట్, స్వెప్సన్‌, జంపా, స్టోయినిస్‌, అండ్రూ టై,డేనియల్‌ సామ్స్‌‌

Advertisement
Advertisement