
ICC Mens T20 World Cup 2022 - India vs Netherlands: టీ20 ప్రపంచకప్-2022 తొలి మ్యాచ్‌లోనే పాక్‌పై అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు పసికూన నెదర్లాండ్స్‌తో తలపడేందుకు సిద్దమైంది. సిడ్నీ వేదికగా గురువారం(ఆక్టోబర్ 27) భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే నెదర్లాండ్స్ పసికూన కాదా అని భారత్ తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఏడాది ప్రపంచకప్‌లో చిన్నచిన్న జట్లే టాప్ టీమ్‌లకు బిగ్ షాక్‌లు ఇస్తున్నాయి. తొలుత... ఆసియాకప్ చాంపియన్స్ శ్రీలంకను నమీబియా చిత్తు చేయగా.. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లను పసికూన ఐర్లాండ్ మట్టి కరిపించింది.
ఇక నెదర్లాండ్స్ విషయానికి వస్తే.. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా నెదర్లాండ్స్ ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో డచ్ ఓపెనర్ మాక్స్ ఓ'డౌడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. మరోవైపు ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ కూడా అదరగొడుతున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితో కూడా డి లీడ్ రాణిస్తున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో లో రెండు సార్లు జట్టును గెలిపించి అతను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అతడు నిలిచాడు.
మరోవైపు అకర్‌మన్, టామ్ కూపర్ వంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. అదే విధంగా యువ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్స్‌కు కూడా రాణించే సత్తా ఉంది. ఇక బౌలింగ్ పరంగా డచ్ ప్రధాన బౌలర్ మీర్‌కెరెన్ కూడా ఫామ్ ఉన్నాడు.
అదే విధంగా క్లాసన్ కూడా బంతితో ముప్పుతిప్పలు పెట్టగలడు. కాగా 2009, 2014 టి20 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్‌ను ఓడించిన రికార్డు నెదర్లాండ్స్‌కు ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ జోరు ముందు నెదర్లాండ్స్ నిలుస్తుందో లేదో చూడాలి.
చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. ఫైనల్ ఆ రెండు జట్లే మధ్యే