
ముంబై: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ని టీమిండియా ఓడిస్తుందని టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా జూన్ 2న ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరగనుంది. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిన్‌లో భాగంగా భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది.
అయితే బుధవారం ముంబయికి చేరుకున్న టీమిండియా ముంబయిలో కఠిన నిబంధనల మధ్య ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండనుంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్‌కి బయలుదేరనుంది. ఇంగ్లాండ్ టూర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చతేశ్వర్ పుజారా మాట్లాడుతూ.. టీమిండియా విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశాడు. చివరి సారిగా సౌథాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా 132 పరుగులు చేసి ఆజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. కానీ ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమి పాలైంది.
(చదవండి:T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ)