Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..

Ind Vs SL 1st T20I Deepak Hooda Furious Abuse At Umpire Netizens Fire - Sakshi

India vs Sri Lanka, 1st T20I- Deepak Hooda: స్వదేశంలో.. కొత్త సంవత్సరం శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్‌...  రాణిస్తారనుకున్న వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడం.. 11–15 ఓవర్ల మధ్య కేవలం 26 పరుగులే! అప్పటికే నాలుగు వికెట్లు చేజారాయి.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఆదుకుంటాడనుకుంటే.. 29 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌ను దిల్షాన్‌ మధుషంక పెవిలియన్‌కు పంపాడు. 

హుడా, అక్షర్‌ సూపర్‌
అప్పటికి టీమిండియా స్కోరు 94/5. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్పిన్‌ ఆల్‌రౌండర్లు దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌ కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. 23 బంతుల్లో హుడా 41 పరుగులతో, 20 బంతుల్లో 31 పరుగులతో అక్షర్‌ ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 162 పరుగుల స్కోరు చేయగలిగింది. 

ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంక ఆఖర్లో తడబడటంతో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్‌ హుడా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అవసరమైన సమయంలో జట్టును ఆదుకుని అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

మరీ ఇంత నీచంగా మాట్లాడతావా?
అయితే, అదే సమయంలో అంపైర్‌తో అనుచిత ప్రవర్తన కారణంగా దీపక్‌ హుడాపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదని, అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఇదే నేర్పించారా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో కసున్‌ రజిత ఐదో బంతిని అవుట్‌సైడ్‌ దిశగా వేయగా.. తొలుత షాట్‌ ఆడాలనుకున్న హుడా.. దానిని వదిలేశాడు. ఈ బంతిని అంపైర్‌ వైడ్‌గా ప్రకటిస్తాడనుకున్నాడు. కానీ అలా జరుగలేదు.

అప్పటికే లో స్కోరింగ్‌ (133-5)నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న హుడా.. అంపైర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడాడు. అతడితో వాదనకు కూడా దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో హుడా ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు మాత్రం అంపైర్‌ ఇందుకు అర్హుడే అంటూ విపరీత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

చదవండి: Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌.. త్వరలోనే అక్తర్‌ను కూడా!
Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు.. పీలే అంత్యక్రియలు పూర్తి 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top