
Quinton De Kock: టీమిండియాతో కీలక సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, వికెట్‌కీపర్ క్వింటన్ డికాక్ వ్యక్తిగత కారణాల చేత రెండు, మూడు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నాడని ఆ జట్టు సెలెక్షన్ కన్వీనర్ విక్టర్ పిట్సాంగ్ వెల్లడించాడు. జనవరిలో అతని భార్య సశా బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండడంతో డికాక్ పితృత్వపు సెలవులు తీసుకుంటున్నట్లు విక్టర్ ప్రకటించాడు.
డికాక్ గైర్హాజరీలో కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్‌లను వికెట్‌కీపింగ్ బాధ్యతల కోసం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26-30 వరకు తొలి టెస్ట్, జొహన్నెస్‌బర్గ్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు రెండో టెస్ట్, కేప్‌టౌన్ వేదికగా జనవరి 11-15 వరకు మూడో టెస్ట్ జరగాల్సి ఉంది.
చదవండి: ఆండ్రీ రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో విధ్వంసం