IND vs NZ 2nd Test: ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు గాయాలు..

IND vs NZ 2nd Test: Why Mayank Agarwal Shubman Gill Did Not Take Field During Final Session - Sakshi

IND vs NZ 2nd Test: Why Mayank Agarwal Shubman Gill Did Not Take Field During Final Session: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌ గాయపడ్డారు. వీరి పరిస్థితిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అప్‌డేట్‌ ఇచ్చింది. ‘‘రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నపుడు.. మయాంక్‌ అగర్వాల్‌ కుడి ముంజేతికి గాయమైంది. ముందు జాగ్రత్తగా అతడిని విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. కాబట్టి అతడు ఫీల్డింగ్‌కు రావడం లేదు’’అని ట్వీట్‌ చేసింది.

ఇక రెండో రోజు ఆటలో భాగంగా శనివారం శుభ్‌మన్‌ గిల్‌ మధ్య వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు కూడా ఆదివారం ఫీల్డింగ్‌కు రాలేదు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 276-7 వద్ద డిక్లేర్‌ చేసింది. ఇక మయాంక్‌ అగర్వాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. అదే విధంగా శుభ్‌మన్‌ గిల్‌... వరుసగా 44 పరుగులు, 47 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీకి చేరువైనప్పటికీ లాంఛనం పూర్తిచేయలేకపోయాడు.

చదవండి: Ravichandran Ashwin: అశ్విన్‌ సరికొత్త రికార్డు.. కుంబ్లేను అధిగమించి..
Sara Tendulkar: నైట్‌ డేట్‌కు వెళ్లిన సారా టెండుల్కర్‌.. ఇంతకీ ఎవరా వ్యక్తి! గిల్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే.
.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top