Ind Vs Nz 2nd Test: మూడో రోజు ముగిసిన ఆట

Ind Vs Nz Test Series 2021 mumbai 2nd Test: Day 3 Highlights Updates In Telugu - Sakshi

India Vs Nz 2nd Test Day 3 2021 Highlights & Updates..సమయం: 5:37 PM:
►టీమిండియా- న్యూజిలాండ్‌ రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. కివీస్‌ 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. టీమిండియా స్కోరు కంటే ఇంకా 400 పరుగులు వెనుకబడి ఉంది. రచిన్‌ రవీంద్ర, హెన్రీ నికోలస్‌ క్రీజులో ఉన్నారు. అశ్విన్‌కు మూడు, అక్షర్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కాయి.
న్యూజిలాండ్‌ స్కోరు: 140/5 (45)  
టీమిండియా కంటే ఇంకా 400 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్‌.

4:55 PM: న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో టామ్‌ బ్లండెల్‌ రనౌట్‌ అయ్యాడు. రచిన్‌ రవీంద్ర, హెన్రీ నికోలస్‌ క్రీజులో ఉన్నారు.
స్కోరు: 130/5 (37.5)

4:48 PM:
న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌ అవుటయ్యాడు. అంతకుముందు టామ్‌ లాథమ్‌, విల్‌ యంగ్‌ సహా రాస్‌ టేలర్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపాడు. 

  4: 17 PM:
న్యూజిలాండ్‌ స్కోరు: 91/3 (28.1 ఓవర్లలో)
భారత్‌ కంటే ఇంకా 445 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్‌

3: 26 PM: మూడు వికెట్లు కోల్పోయిన కివీస్‌
స్కోరు:  55/3 (16.1)
భారత్‌ కంటే ఇంకా 485 పరుగులు వెనుకబడి ఉన్న న్యూజిలాండ్‌

 3:14 PM:
కివీస్‌ స్కోరు(సెకండ్‌ ఇన్నింగ్స్‌): 45/1 (13.2).

3:03 PM: కివీస్‌ స్కోరు(సెకండ్‌ ఇన్నింగ్స్‌): 22/1 (10.1).భారత్‌ కంటే ఇంకా 514 పరుగులు వెనుకబడి ఉంది.

ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన లాథమ్‌
అశ్విన్‌ బౌలింగ్‌లో కివీస్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15 బంతులు ఎదుర్కొన్న అతడు 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.

2:00 pm: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌ను  276-7 వద్ద భారత్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి భారత్‌ 540పరుగుల అధిక్యం సాధించింది. టీమిండియా  ఇన్నింగ్స్‌లో 62 పరుగులతో అగర్వాల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా, పుజారా, కోహ్లి, అక్షర్‌ పటేల్‌ రాణించారు. ఇక న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ నాలుగు వికెట్లు సాధించగా, రచిన్‌ రవీంద్ర మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా అజాజ్‌ పటేల్‌ ఈ మ్యాచ్‌లో 14 వికెట్లు సాధించి రికార్డు సృష్టించాడు.

టీమిండియా వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మాన్‌ గిల్‌(47)ను రచిన్‌ రవీంద్ర పెవిలియన్‌కు పంపగా,  శ్రేయాస్‌ అయ్యర్‌ అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో స్టంప్‌ ఔట్‌గా వెనుదిరగాడు. ఇక 36 పరుగులు చేసిన కెప్టెన్‌ కోహ్లి.. రచిన్‌ రవీంద్ర క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులో వృద్ధిమాన్ సాహా, అక్షర్‌ పటేల్‌ ఉన్నారు. టీమిండియా ప్రస్తుత స్కోర్‌ 5 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో ‍ కలిపి భారత్‌ 488 అధిక్యంలో ఉంది.

1:00 am: 115 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 47 పరుగులు చేసిన పుజారా అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో శుభ్‌మాన్‌ గిల్‌(15), కోహ్లి(4)పరుగులతో ఉన్నారు. 41 ఓవర్లకు టీమిండియా రెండు నష్టానికి 130 పరుగులు చేసింది.

10:30 Am.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌ అగర్వాల్‌(62) అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో పుజారా(47),శుభ్‌మాన్‌ గిల్‌(2) పరుగులతో ఉన్నారు. 33 ఓవర్లకు టీమిండియా వికెట్‌ నష్టానికి 110 పరుగులు చేసింది.

10:11 Am: మూడో రోజు ఆటను భారత్‌ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ అర్ధసెంచరీ సాధించాడు. 30 ఓవర్లకు టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్‌ అగర్వాల్‌ (58),పుజారా(41) పరుగులతో ఉన్నారు.

సమయం: 9:30 Am: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచిన భారత్‌ మూడో రోజు ఆటమెదలు పెట్టింది.  భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మెదటి రోజు ఆటముగిసే సమయానికి 21 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్‌(38),పుజారా(29) పరుగులతో ఉన్నారు. 

భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌.

న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్‌), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌథీ, విలియం సోమర్‌విల్లే, అజాజ్ పటేల్

చదవండి: Andre Russell: బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top