ఇంగ్లండ్‌పై గ్రాండ్‌ విక్టరీ.. రోహిత్‌ శర్మ సాధించిన ఘనతలు | Sakshi
Sakshi News home page

CWC 2023: ఇంగ్లండ్‌పై గ్రాండ్‌ విక్టరీ.. రోహిత్‌ శర్మ సాధించిన ఘనతలు

Published Sun, Oct 29 2023 10:55 PM

IND VS ENG: Rohit Sharma Is The Only Indian Player To Receive 2 Player Of The Match Awards In 2023 WC - Sakshi

లక్నో వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 29) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జగజ్జేతలను 100 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ స్వల్ప స్కోర్‌కే (229) పరిమితమైనప్పటికీ.. బౌలర్లు అసమానమైన ప్రతిభ కనబర్చి జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించారు. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించగా.. బౌలింగ్‌లో బుమ్రా (6.5-1-32-3), షమీ (7-2-22-4), కుల్దీప్‌ (8-0-24-2), రవీంద్ర జడేజా (7-1-16-1) ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు (129). 

కఠినమైన పిచ్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించిన హిట్‌మ్యాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు పలు ఘనతలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ సాధించిన ఘనతలు ఇలా ఉన్నాయి. 

  • ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు దక్కించుకున్న ఏకైక భారత ప్లేయర్‌
  • ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన ఏకైక ప్లేయర్‌
  • ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 18000 అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటాడు
  • ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు
  • ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు
  • సింగిల్‌ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌
  • 2023లో వన్డేల్లో 1000 పరుగులు పూర్తి
  • వరల్డ్‌కప్‌లో సచిన్‌ (9) తర్వాత అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు (7)
  • భారత కెప్టెన్‌గా 100వ మ్యాచ్‌లో విజయం
  • కనీసం 100 మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్లలో (ఓవరాల్‌గా) అత్యధిక విన్నింగ్‌ పర్సంటేజ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement