Cheteshwar Pujara: పుజారా అరుదైన ఘనత! దిగ్గజాల సరసన.. కోహ్లి తర్వాత..

Ind Vs Ban 2nd Test: Pujara Joins Legends Sachin Dravid List Check - Sakshi

Bangladesh vs India, 2nd Test - Cheteshwar Pujara: టీమిండియా నయా వాల్‌  ఛతేశ్వర్‌ పుజారా టెస్టు క్రికెట్‌లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. తద్వారా సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండుల్కర్‌  వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

ఢాకాలోని షేర్‌-ఈ- బంగ్లా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ వేసిన బంతి(18.5 ఓవర్‌)కి మూడు పరుగులు తీసి పుజారా 7 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే, మొదటి టెస్టులో అజేయ సెంచరీతో మెరిసిన పుజారా(90, 102 నాటౌట్‌) రెండో మ్యాచ్‌లో 24 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ ముగించాడు. 

కాగా సౌతాఫ్రికా టూర్‌ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. కౌంటీల్లో ససెక్స్‌ తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రంమలో ఇంగ్లండ్‌ పర్యటనలో ఆఖరి టెస్టులో జట్టులో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం బంగ్లా టూర్‌లో స్థాయికి తగ్గట్లు ఆడుతున్నాడు.

టెస్టుల్లో 7 వేల పైచిలుకు పరుగులు.. జాబితాలో పుజారా
►సచిన్‌ టెండుల్కర్‌- 15,921
►రాహుల్‌ ద్రవిడ్‌- 13265
►సునిల్‌ గావస్కర్‌- 10122
►వీవీఎస్‌ లక్ష్మణ్‌- 8781
►వీరేంద్ర సెహ్వాగ్‌- 8503
►విరాట్‌ కోహ్లి- 8099*
►సౌరవ్‌ గంగూలీ- 7212
►ఛతేశ్వర్‌ పుజారా- 7000*

చదవండి: Ind Vs Ban: నీ ఆట తీరు మారదా.. అసలు నీకేమైంది రాహుల్‌!? ద్రవిడ్‌, నువ్వూ కలిసి..
వేలంలో.. ఆ అఫ్గన్‌ యువ బౌలర్‌ సూపర్‌స్టార్‌! స్టోక్స్‌, ఉనాద్కట్‌ కోసం పోటీ: మిస్టర్‌ ఐపీఎల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top