ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం

ICC Mens T20I Team Of The Year 2022: 2022 సంవత్సరానికి గానూ ఐసీసీ ఇవాళ (జనవరి 23) తమ అత్యుత్తమ పురుషుల టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్.. జట్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్‌ను ఎంపిక చేసింది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. మొత్తం 11 మంది సభ్యుల జాబితాను వెల్లడించింది.
ఓపెనర్లుగా కెప్టెన్ జోస్ బట్లర్ (ఇంగ్లండ్, వికెట్‌కీపర్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)లను ఎంపిక చేసిన ఐసీసీ మేనేజ్‌మెంట్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి (భారత్), ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), ఆల్‌రౌండర్ల కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), హార్ధిక్ పాండ్యా (భారత్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), స్పిన్నర్‌గా వనిందు హసరంగ (శ్రీలంక), పేసర్లుగా హరీస్ రౌఫ్ (పాకిస్తాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్)లను ఎంపిక చేసింది.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు