ఐఎస్‌ఎల్‌ ఫైనల్లో హైదరాబాద్‌  | Hyderabad Football Club Enters Final Indian Super League | Sakshi
Sakshi News home page

Indian Super League: ఐఎస్‌ఎల్‌ ఫైనల్లో హైదరాబాద్‌ 

Mar 17 2022 7:23 AM | Updated on Mar 17 2022 7:25 AM

Hyderabad Football Club Enters Final Indian Super League - Sakshi

బాంబోలిమ్‌ (గోవా): హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ) జట్టు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఏటీకే మోహన్‌ బగాన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ రెండో దశ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 0–1తో పరాజయం పాలైంది. మోహన్‌ బగాన్‌ తరఫున 79వ నిమిషంలో కృష్ణ గోల్‌ నమోదు చేశాడు. అయితే ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన తొలి దశ సెమీ ఫైనల్లో హైదరాబాద్‌ 3–1తో విజయం సాధించింది. ఇప్పుడు రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌ల తర్వాత ఓవరాల్‌గా 3–2 గోల్స్‌ తేడాతో హైదరాబాద్‌ ముందంజ వేసింది. ఈ నెల 20న జరిగే ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీతో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తలపడుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement