WTC FInal: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది

How SA Loss 2nd Test Vs AUS Improves India Chances Making WTC Final - Sakshi

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టును ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 182 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఈ దెబ్బతో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. ఈ విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించే విషయంలో మరింత పటిష్ట స్థానానికి చేరుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికాను వరుసగా రెండు టెస్టుల్లో చిత్తు చేసి 78.57 పర్సంటేజీ పాయింట్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది.

ఇక మూడో టెస్టులోనూ గెలిస్తే ఆసీస్‌ పాయింట్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా దాదాపు చేరుకున్నట్లే. ఇక వరుసగా రెండో టెస్టులోనూ ఓటమితో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 50 పర్సంటేజీ పాయింట్లతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి పడిపోయింది. నాలుగో స్థానంలో ఉన్న శ్రీలంక 53.3 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది.

ఇక రెండో స్థానంలో ఉన్న టీమిండియాకు వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా 58.93 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తూ ఎలాంటి అడ్డంకులు లేకుండా  టీమిండియా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా పోతూ పోతూ మనకు మాత్రం మేలు చేసిందని చెప్పొచ్చు. వచ్చే ఏడాది జూన్‌- జూలైలో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది.

ఇక ఇంగ్లండ్‌(46.97 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది. ఇటీవలే ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్‌ అయిన పాకిస్తాన్‌ 38.89 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ 25.93 పర్సంటేజీ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్‌ అయిన బంగ్లాదేశ్‌ 11.11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది.

చదవండి: Bavuma-Marco Jansen: 'వీడేంటి ఇంత పొడుగున్నాడు'

Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్‌.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో ఇక..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top