ఆకాశ్‌దీప్ హ్యాట్రిక్ వృథా.. ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి

IND VS AUS Hockey Test Series: ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత పురుషుల జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–5 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత స్టార్ ప్లేయర్ ఆకాశ్‌దీప్ సింగ్ (10వ, 27వ, 59వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించినా ఫలితం లేకపోయింది. మరో గోల్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (31వ ని.లో) అందించాడు. ఆ్రస్టేలియా తరఫున లాచ్లాన్ షార్ప్ (5వ ని.లో), నాథన్ ఇఫారౌమ్స్ (21వ ని.లో), టామ్ క్రెయిగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బ్లేక్ గోవర్స్ (57వ, 60వ ని.లో) రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు