పాక్‌తో మ్యాచ్‌.. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్‌ | New Milestone For Harmanpreet Kaur As She Becomes India’s Top Run Scorer In Women’s T20 World Cup | Sakshi
Sakshi News home page

IND-w Vs PAK-w: పాక్‌తో మ్యాచ్‌.. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్‌

Jun 14 2026 8:29 PM | Updated on Jun 15 2026 2:22 PM

Harmanpreet Breaks Mithali Raj Record Most-Runs-Indian-Womens T20 WC

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఒక అరుదైన రికార్డు సాధించింది. భార‌త్ త‌ర‌ఫున టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా హ‌ర్మ‌న్ నిలిచింది. మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ర‌ఫున ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 స‌గ‌టుతో 726 ప‌రుగులు సాధించింది. 

తాజాగా హ‌ర్మ‌న్‌ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్లో బౌండ‌రీ కొట్ట‌డం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బ‌ద్ద‌లుకొట్టి అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇక హ‌ర్మ‌న్, మిథాలీ రాజ్ త‌ర్వాత స్మృతి మంధాన 524 ప‌రుగుల‌తో మూడో స్థానంలో ఉండ‌గా, జెమీమా రోడ్రిగ్స్ 407 పరుగులతో నాలుగో స్థానంలో, పూనమ్ రౌత్ 375 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 

మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 122  పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ (36), రిచా ఘోష్ (7) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్ స్మృతి మంధాన 68 పరుగులు చేసింది.

చదవండి: బాస్కెట్‌బాల్‌ చ‌రిత్రలో సంచ‌ల‌నం.. 53 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement