Virat Kohli: కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసి వస్తుంది: మిచెల్ జాన్సన్

Good for India that Virat Kohli is scoring again - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు స్వదేశంలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌లో అందరి కళ్లు భారత స్టార్‌ విరాట్‌ కోహ్లిపైనే ఉన్నాయి. అసియాకప్‌-2022లో అదరగొట్టిన కోహ్లి.. ఇప్పడు ఆసీస్‌ సిరీస్‌లో ఎలా రాణిస్తాడో అని అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో విరాట్‌ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ మిచెల్ జాన్సన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు విరాట్‌ కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూల అంశమని జాన్సన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా భారత్‌ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో మిచెల్ జాన్సన్ ఆడుతున్నాడు.

ఈ క్రమంలో ఏఎన్‌ఐతో జాన్సన్‌ మాట్లాడుతూ.. "సరైన సమయంలో విరాట్‌ కోహ్లి తిరిగి తన రిథమ్‌ను పొందాడు. ఇది భారత జట్టుకు కలిసొచ్చే అంశం. కోహ్లి వంటి అత్యుత్తమ ఆటగాడు పామ్‌లో ఉంటే.. మిగితా ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ మరింత రెట్టింపు అవుతుంది.

ఇక టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక విరాట్‌ కోహ్లి.. భారత జట్టు వైపు అందరి దృష్టిని మళ్లించాడు. ఇక ప్రపంచకప్‌కు ముందు కీలక సిరీస్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో ఏ జట్టు విజయం సాధించినా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌లో అడుగుపెడుతోంది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Suryakumar Yadav: 'నాలుగో నెంబర్‌ ఇక నాదే.. ఎవరికి ఇవ్వను'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top