ధోని రికార్డును ఏ కెప్టెన్‌ బ్రేక్‌ చేయలేరు.. | Gautam Gambhir Says MS Dhoni ICC Trophies Record That Is Forever | Sakshi
Sakshi News home page

ధోని రికార్డును ఏ కెప్టెన్‌ బ్రేక్‌ చేయలేరు: గౌతమ్‌

Aug 17 2020 11:09 AM | Updated on Aug 17 2020 12:36 PM

Gautam Gambhir Says MS Dhoni ICC Trophies Record That Is Forever - Sakshi

ఢిల్లీ: టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ స్పందించారు. ధోని తన సారథ్యంలో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాలు అందించి, రికార్డులు సృష్టించాడని ప్రశంసించారు. ఆయన క్రికెట్ కనెక్ట్ షోలో మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్‌గా ధోని నెలకొల్పిన రికార్డులు చిరస్థాయిలో నిలిచిపోతాయని తెలిపారు. అదే విధంగా మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన కెప్టెన్‌గా ధోని రికార్డును ఎవరు అందుకోలేరని పేర్కొన్నారు. ఆ రికార్డు ఆయన పేరు మీదనే ఉంటుందన్నారు. నేను ఈ విషయంతో ఛాలెంజ్‌ చేయగలనని పేర్కొన్నారు.సెంచరీలు, డబుల్‌ సెంచరీలకు సంబంధించిన రికార్డులు సైతం బ్రేక్‌ అవుతాయి.  కానీ, ధోని కెప్టెన్‌గా సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీల రికార్డు మాత్రం సమీప భవిష్యత్తులో ఏ కెప్టెన్‌ బ్రేక్‌ చేయలేరని అన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతూ మహేంద్ర సింగ్‌ ధోని ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (ధోనీకి వీడ్కోలు ప‌లికేందుకు చివ‌రి ఫేర్‌వెల్ మ్యాచ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement