FIFA WC 2022: 60 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ఫ్రాన్స్‌ ఫుట్‌బాలర్‌

France Kylian Mbappe Overtakes Legendary Pele Break 60-year Old FIFA WC - Sakshi

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లు రికార్డులతో హోరెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌ స్టార్‌ ప్లేయర్ కిలియన్‌ ఎంబాపె డబుల్‌ గోల్స్ తో చెలరేగాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటికే ఐదు గోల్స్ కొట్టాడు. గత టోర్నీలో నాలుగు సాధించాడు. దీంతో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా,పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (చెరో 8 గోల్స్‌)ను అధిగమించాడు.

ప్రస్తుతం అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీతో కలిసి సంయుక్తంగా తొమ్మిది గోల్స్‌తో ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట 60 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మరో రికార్డును సైతం ఎంబాపె బద్దలు కొట్టడం విశేషం. అదేంటంటే.. 24 ఏళ్లలోపే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

తన కెరీర్లో బ్రెజిల్‌కు మూడు ఫిఫా వరల్డ్‌కప్‌ టైటిల్స్‌ అందించిన పీలే 24 ఏళ్లలోపు ఏడు గోల్స్ సాధించాడు. ఈ రికార్డు 60 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు ఎంబాపె 23 ఏళ్లకే తొమ్మిది గోల్స్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. అతనితో పాటు ఒలివర్ గిరౌడ్ కూడా ఓ గోల్ సాధించడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో పోలెండ్ జట్టును ఓడించింది. ఒలివర్ గిరౌడ్ 44వ నిమిషంలో గోల్ సాధించగా.. ఎంబాపె 74, 90 1వ నిమిషాల్లో రెండు గోల్స్ రాబట్టాడు. పోలెండ్ తరఫున రాబర్ట్ లావెండోస్కీ అదనపు సమయం తొమ్మిదో నిమిషంలో ఏకైక గోల్ అందించాడు. 

చదవండి: మ్యాచ్‌ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top