Five more members test positive for COVID 19 from the West Indies camp - Sakshi
Sakshi News home page

WI Vs PAK: వెస్టిండీస్‌ జట్టులో కరోనా కలకలం.. సిరీస్‌ ఇక కష్టమే!

Dec 16 2021 11:18 AM | Updated on Dec 16 2021 11:25 AM

Five more members test positive for COVID 19 from the West Indies camp - Sakshi

పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న వెస్టిండీస్‌ జట్టులో మరోసారి కరోనా కలకలం రేపింది. ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు, ఇద్దరు కోచింగ్‌ స్టాప్‌ కరోనా బారిన పడినట్టు ఆ దేశ క్రికెట్‌ బోర్డు తెలిపింది. "మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది" అని వెస్టిండీస్‌ క్రికెట్‌ ట్విటర్‌లో పేర్కొంది. ఆ జట్టు వికెట్‌ కీపర్‌ షాయ్ హోప్,జస్టిన్ గ్రీవ్స్, అకేల్ హోసేన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.

కాగా అంతకుముందు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్,షెల్డన్ కాట్రెల్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అతిథ్య పాకిస్తాన్ ‌2-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా అఖరి టీ20 గురువారం(డిసెంబర్‌16)న జరగనుంది. అయితే కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతే కాకుం‍డా త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌పై ఈ ప్రభావం ఉండనుంది. ఇక  ఆటగాళ్లు బయోబబుల్‌లో ఉన్నప్పటికీ కేసులు నమోదు కావడం అందరనీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్‌దేవ్‌ సంచలన వాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement