ఇమ్రాన్ తాహిర్ విధ్వంసం.. 5 సిక్స్‌లు,3 ఫోర్లల‌తో.. | Finisher Imran Tahir wins it for World Giants Against India Maharajas | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్ తాహిర్ విధ్వంసం.. 5 సిక్స్‌లు,3 ఫోర్లల‌తో..

Jan 23 2022 10:10 AM | Updated on Jan 23 2022 11:59 AM

Finisher Imran Tahir wins it for World Giants Against India Maharajas - Sakshi

లెజెండ్స్ క్రికెట్‌ లీగ్ లో ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ ఇమ్రాన్  తాహిర్ బ్యాట్‌తో విద్వంసం సృష్టించాడు. లెజెండ్స్ క్రికెట్‌ లీగ్ లో వ‌ర‌ల్డ్ జెయింట్స్‌కు తాహిర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండియా మహారాజాస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసి జెయింట్స్‌ను గెలిపించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాజాస్ న‌మ‌న్‌ ఓజా(140), కెప్టెన్ కైఫ్(53) చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 209 ప‌రుగులు సాధించింది. అనంత‌రం 210 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెయింట్స్ విజ‌యంలో కెవిన్ పీట‌ర్స‌న్(53), తాహిర్ (52) ప‌రుగులుతో కీల‌క పాత్ర పోషించారు.

చ‌ద‌వండి నమన్ ఓజా తుపాన్ ఇన్నింగ్స్‌.. 15 ఫోర్లు, 9 సిక్స్‌లు.. కేవ‌లం 60 బంతుల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement