పాక్‌లో క్రికెట్‌ స్టేడియం వద్ద బాంబు పేలుళ్లు.. ఇండియన్స్‌పై నోరు పారేసుకుంటున్న పాకిస్తానీలు

Fans Criticizing Indians Over Bomb Blast Near By Cricket Stadium - Sakshi

పాకిస్తాన్‌లో ఏ మూలన ఏం జరిగినా ఇండియాపై, ఇండియన్స్‌పై నోరు పారేసుకోవడం పాకిస్తానీలకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జరిగిన ఓ సంఘటనను సంబంధించి కూడా పాకీలు ఇలాగే భారతీయులపై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2023 సీజన్‌ సన్నాహకాల్లో భాగంగా క్వెట్టా స్టేడియం (భుగ్తీ) వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 5) పెషావర్ జల్మీ - క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ జరుగుతుండగా స్టేడియంకు అతి సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి.

ఈ పేలుళ్లలో పదలు సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. పేలుళ్లకు కారణాలు తెలియరానప్పటికీ.. అక్కడికి అతి సమీపంతో పాక్‌ అంతర్జాతీయ క్రికెటర్లు క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతున్నందున​ అధికారులు మ్యాచ్‌ను రద్దు చేసి హుటాహుటిన ఆటగాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మ్యాచ్‌ జరుగుతుండగా స్డేడియం మొత్తాన్ని పొగ ఆవహించడంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. జనాలు స్డేడియం నుంచి బయటకు వెళ్లే క్రమంలో తొక్కసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే, పేలుళ్లను ఆతర్వాత స్టేడియంలో నెలకొన్న పరిణామాలను పాక్‌ నెటిజన్లు వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్ల కారణంగా ఎక్కడ ఆసియా కప్‌-2023 నిర్వహణ తమ దేశం నుంచి తరలిపోతుందోనని సీన్‌ను వేరేలా క్రియేట్‌ చేశారు. అసలు విషయాన్ని దాచే క్రమంలో పాక్‌ అభిమానులు భారతీయులపై బురదజల్లుతున్నారు. పాక్‌లో ఆసియా కప్‌ నిర్వహించడం బీసీసీఐకు భారతీయులకు ఇష్టం లేదని, అందుకే పేలుళ్లను బూచిగా చూపి సోషల్‌మీడియాలో విషప్రచారం చేస్తున్నారని అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు.

పేలుళ్లకు మ్యాచ్‌ రద్దు చేయడానికి అస్సలు సంబంధం లేదని, మ్యాచ్‌ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరారని, వారిలో చాలామందికి లోనికి ప్రవేశం లభించలేదని, అలాంటి వారు బయట నుంచి స్టేడియంలోకి రాళ్లు విసరడంతో ఆందోళన జరిగిందని లేని విషయాన్ని కథగా అల్లారు. కొందరు పాకీలు అయితే ఏదో ఫేక్‌ వీడియోను ట్రోల్‌ చేస్తూ.. స్టేడియం వద్ద జరిగింది ఇది, అసత్యాలను ప్రచారం చేస్తున్న భారతీయుల కోసమే ఇది అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇందుకు భారతీయులు సైతం ధీటుగా జవాబిస్తున్నారు. విషప్రచారాలు చేయడం పాకీలకే చెల్లుతుంది.. పేలుళ్లు జరిగినా, జరగకపోయినా ఆసియాకప్‌ ఆడేందుకు పాక్‌లో అడుగుపెట్టేది లేదంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే, క్వెట్టా స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్‌లో మ్యాచ్‌లో పాక్‌ ఆటగాడు ఇఫ్తికార్‌ అహ్మద్‌.. అదే దేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్‌ మినిస్టర్‌ వాహబ్‌ రియాజ్‌ బౌలింగ్‌లో 6 వరుస బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు.  

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top