Shubman Gill-Sara Ali Khan met again at Ahmedabad Airport, pic goes viral - Sakshi
Sakshi News home page

Shubman Gill-Sara Ali Khan: వాళ్లిద్దరు నిజంగా కలిశారా..?

Published Fri, Feb 3 2023 11:16 AM

Fact Check: Gill-Sara Ali Khan Met-Again At Ahmedabad Airport Viral - Sakshi

Fact Check.. టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం జట్టులో భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న గిల్‌ మూడు ఫార్మట్లలోనూ(టెస్టు, వన్డే, టి20లు) కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఓపెనింగ్‌ స్థానంలో వస్తూ సెంచరీలతో దడ పుట్టిస్తున్న గిల్‌ రానున్న కాలంలో జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటీవలీ న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే, టి20 సిరీస్‌లోనూ శుబ్‌మన్‌ గిల్‌ అదరగొట్టాడు. ముఖ్యంగా టి20 ఆటకు సరిపోడు అని విమర్శలు వచ్చిన వేళ.. కివీస్‌తో జరిగిన మూడో టి20లో 63 బంతుల్లోనే 126 పరుగులు నాటౌట్‌.. సుడిగాలి ఇన్నింగ్స్‌తో గట్టి సమాధానమిచ్చాడు. తనపై ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉ‍న్నా ఈ ఇన్నింగ్స్‌తో అవన్నీ తొలగిపోయినట్లేనని చెప్పకనే చెప్పాడు గిల్‌. టీమిండియా మాజీ క్రికెటర్లు సహా కోహ్లి లాంటి వరల్డ్‌ క్లాస్‌ క్రికెటర్‌ ఫ్యూచర్‌ స్టార్‌ క్రికెటర్‌ అంటూ గిల్‌పై పొగడ్తలు కురిపించాడు. కచ్చితంగా భారత్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో గిల్‌ పాత్ర కీలకం కానున్నట్లు స్పష్టంగా తెలియరానుంది.

ఈ విషయం పక్కనబెడితే.. సోషల్‌ మీడియాలో శుబ్‌మన్‌ గిల్‌కు సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ హీరోయిన్‌, నటి సారా అలీఖాన్‌తో గిల్‌ ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్నాళ్ల నుంచి రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ‍వ్యవహారంపై అటు గిల్‌.. ఇటు సారా ఇద్దరు నోరు మెదపలేదు. అయితే మీడియా కంట పడకుండా వీరిద్దరు తమ ప్రేమాయణం కొనసాగిస్తునట్లు క్రికెట్‌ ఫ్యాన్స్‌ గుసగుసలాడుకుంటున్నారు.

ఇదిలా ఉండగానే.. బుధవారం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో గిల్‌.. సారా అలీఖాన్‌లు సీరియస్‌గా మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే వాళ్లిద్దరు నిజంగా కలుసుకున్నారా లేదంటే ఇదంతా గాసిప్‌ రాయుళ్ల ఎడిటింగ్‌ పనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తాజాగా చక్కర్లు కొడుతున్న ఫోటో పాతదేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

నిజానికి సారా అలీఖాన్‌ అహ్మదాబాద్‌కు రాలేదని.. ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటో ఎడిటింగ్‌ అని.. ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా క్రియేట్‌ చేశారని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం గతేడాది కూడా ఇలాంటి ఫోటోనే ఒకటి సోషల్‌ మీడియాలో పెట్టారని.. అది ఇప్పటిది మాత్రం కాదని కుండబద్దలు కొట్టారు. ఏది ఏమైనా గిల్‌-సారా అలీఖాన్‌లు మధ్య ప్రేయాయణం నడుస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. వీరికి సంబంధించిన వార్తలతో మాత్రం కొంతమంది బతికేస్తున్నారంటూ నెటిజన్లు పేర్కొన్నారు.

ఇక గిల్‌, సారా అలీఖాన్‌లు కలిసి జైపూర్‌లోని ఒక రెస్టారెంట్‌లో తొలిసారి కనిపించడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ నడుస్తుందంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పంజాబీ నటి సోనమ్‌ భజ్వాతో టీవీ చాట్‌ షో సందర్భంగా గిల్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఒక అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు.. ఆమె పేరు సారా అని మాత్రమే చెప్పాడు.

అయితే సారా అని పేరు చెప్పి ముందు వెనకాల ఏం చెప్పకుండా అభిమానులను కన్ఫ్యూజ్‌ అయ్యేలా చేశాడు. దీంతో కొంతమంది గిల్‌.. సారా అలీఖాన్‌తో కాకుండా సచిన్‌ టెండూల్కర్‌ గారాలపట్టి సారా టెండూల్కర్‌తో రిలేషిన్‌షిప్‌ కొనసాగిస్తున్నట్లు పుకార్లు పుట్టించారు. అయితే శుబ్‌మన్‌ గిల్‌ చెల్లెలలు షహనీల్‌కు సారా టెండూల్కర్‌ మంచి స్నేహితురాలు. వారిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు యాక్టివ్‌గా ఉంటారు.

ఈ స్నేహం కూడా గిల్‌, సారా టెండూల్కర్‌లు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సారా టెండూల్కర్‌, శుబ్‌మన్‌ గిల్‌లు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కాకపోవడంతో రిలేషన్‌షిప్‌ వార్తలకు కూడ బ్రేక్‌ పడినట్లయింది. దీంతో గిల్‌.. సారా అలీఖాన్‌తోనే డేటింగ్‌లో ఉన్నాడని.. వారిద్దరి ప్రేమాయణం నడుస్తుందంటూ మరోసారి సోషల్‌ మీడియాలో ఊదరగొట్టారు.

చదవండి: గిల్‌పై ఇషాన్‌ కిషన్‌ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్‌

ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్‌ స్టార్‌

Advertisement
 
Advertisement
 
Advertisement