England Players In IPL 2023: 105 కోట్లు పోసి కొన్న ఇంగ్లీషోళ్ల కంటే మనోళ్లు చాలా బెటర్‌..!

England Cricketers Performance In IPL 2023 Still First Phase - Sakshi

ఐపీఎల్‌ 2023లో ఫస్ట్‌ ఆఫ్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 25తో ముగిసాయి. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా గుజరాత్‌, రాజస్థాన్‌, లక్నో, ఆర్సీబీ, పంజాబ్‌, కేకేఆర్‌, ముంబై, సన్‌రైజర్స్‌, ఢిల్లీ జట్లు ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు (35) పూర్తైన నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే, ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. 

వేలంలో 105 కోట్ల పెట్టి కొన్న ఇంగ్లీషోళ్ల కంటే మన వాళ్లు (ఇండియా ప్లేయర్స్‌) చాలా బెటర్‌ అని గణాంకాలు ద్వారా క్లియర్‌గా తెలుస్తోంది. ఇంగ్లండ్‌ జట్టు వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లు గెలవడంతో మన ఫ్రాంచైజీలు వారిని సొంతం చేసుకునేందుకు ఎగబడ్డాయి. అయితే వారిని నుంచి ఆశించినంత ఫలితాలు రాకపోవడంతో ప్రస్తుతం బేరు మంటున్నాయి. 

చదవండి: Hardik Pandya: కెప్టెన్‌ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, తీసేయండి..!

మార్క్‌ వుడ్‌ మినహాయించి ఫస్ట్‌ ఆఫ్‌ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లంతా తేలిపోయారు. హ్యారీ బ్రూక్‌, సామ్‌ కర్రన్‌, బట్లర్‌ లాంటి ఆటగాళ్లు వన్‌ మ్యాచ్‌ వండర్లుగా మిగిలిపోయారు. 3 కోట్లు పెట్టి కొన్న విల్‌ జాక్స్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే గాయం కారణంగా స్వదేశానికి తిరుగుటపా కట్టగా.. స్టోక్స్‌, ఆర్చర్‌ లాంటి స్టార్లు ఒకటి, అరా మ్యాచ్‌లు ఆడి గాయాలను సాకుగా చూపుతూ బెంచ్‌కే పరిమితమయ్యారు. 

లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన లివింగ్‌స్టోన్‌, 8 కోట్ల ఆటగాడు మొయిన్‌ అలీ తమపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేయలేపోయారు. రీస్‌ టాప్లే, డేవిడ్‌ విల్లే, ఫిల్‌ సాల్ట్‌  లాంటి ఆటగాళ్లు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోగా.. ఆదిల్‌ రషీద్‌, జో రూట్‌ లాంటి ఆటగాళ్లు మొత్తానికే అవకాశాలు రాక బెంచ్‌పై సేదదీరుతున్నారు. 

మొత్తానికి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తమపై పెట్టిన 105 కోట్ల పెట్టుబడికి కనీస న్యాయం కూడా చేయలేకపోయారు. వీరికి ఐపీఎల్‌-2023 కంటే దాని తర్వాత వెంటనే జరిగే యాషెస్‌పైనే మక్కువ ఎక్కువ. అందుకే స్టోక్స్‌ లాంటి ఆటగాళ్లు గాయాలను సాకుగా చూపి బెంచ్‌పై రెస్ట్‌ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. 

వాళ్లకంటే మన వాళ్లు వెయ్యి రెట్టు బెటర్‌...
కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఇంగ్లీషోళ్ల కంటే భారత ఆటగాళ్లు వెయ్యి రెట్టు బెటర్‌ అని గణాంకాలు చెబుతున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని, పెద్ద మొత్తానికి కొనుగోలు చేయని వెంకటేశ్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, నితీశ్‌ రాణా, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే.. వెటరన్లు శిఖర్‌ ధవన్‌, రహానే, సాహా అదరగొడుతుండగా.. విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ లాంటి టీమిండియా స్టార్లు స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటుతున్నారు. 

బౌలింగ్‌ విషయానికొస్తే.. ఆర్సీబీ మహ్మద్‌ సిరాజ్‌ ప్రస్తుత సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉండి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతుండగా.. వరుణ్‌ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్‌, చహల్‌, షమీ, అశ్విన్‌లు సత్తా చాటుతున్నారు. అలాగే కొత్త కుర్రాళ్లు సుయాశ్‌ శర్మ, వెటనర్లు పియూశ్‌ చావ్లా, అమిత్‌ మిశ్రా, మోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ అదరగొడుతున్నారు. 

ఇంగ్లండ్‌ ఆటగాళ్లతో పోలిస్తే పై పేర్కొన్న ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు వెచ్చించిన సొమ్ము చాలా తక్కువ. స్టార్లు మినహాయించి మిగతా వారికంతా అరకొర మొత్తమే లభిస్తుంది. అయినప్పటికీ వారు అద్భుతంగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. 

సెకెండ్‌ ఆఫ్‌లో 105 కోట్ల ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతుంది..?
సెకెండ్‌ ఆఫ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతుంది.. వాళ్లు మొత్తం లీగ్‌కు అందుబాటులో ఉంటారా, లేక గాయాలు సాకుగా చూపి బెంచ్‌పై కూర్చుంటారా.. లేక లీగ్‌ అయిపోక ముందే యాషెస్‌కు టైమ్‌ అయ్యిందని లండన్‌కు చెక్కెస్తారా..? దీనిపై మీ అంచనాలను, అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపగలరు.  

ఐపీఎల్‌-2023 ఆడుతున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్ల వివరాలు..

  1. సామ్‌ కర్రన్‌ (పంజాబ్‌ కింగ్స్‌, 18.5 కోట్లు)
  2. బెన్‌ స్టోక్స్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌, 16.25 కోట్లు)
  3. జోస్‌ బట్లర్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌, 10 కోట్లు)
  4. హ్యారీ బ్రూక్‌ (సన్‌రైజర్స్‌, 13.25 కోట్లు)
  5. ఆదిల్‌ రషీద్‌ (సన్‌రైజర్స్‌, 2 కోట్లు)
  6. జో రూట్‌ (రాజస్థాన్‌, కోటి)
  7. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (పంజాబ్‌, 11.50 కోట్లు)
  8. జోఫ్రా ఆర్చర్‌ (ముంబై ఇండియన్స్‌, 8 కోట్లు)
  9. రీస్‌ టాప్లే (ఆర్సీబీ, 1.9 కోట్లు)
  10. డేవిడ్‌ విల్లే (ఆర్సీబీ, 2 కోట్లు)
  11. మార్క్‌ వుడ్‌ (లక్నో, 7.50 కోట్లు)
  12. మొయిన్‌ అలీ (సీఎస్‌కే, 8 కోట్లు )
  13. ఫిల్‌ సాల్ట్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌, 2 కోట్లు)
  14. విల్‌ జాక్స్‌ (ఆర్సీబీ, 3 కోట్లు)

చదవండి: ఏడాదికి 50 కోట్లు ఇస్తాం.. దేశానికి ఆడకండి.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల బంపర్‌ ఆఫర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top